డార్లింగ్స్ మన లైఫ్ లోకి స్పెషల్ వ్యక్తి రాబోతున్నారంటూ ప్రభాస్ పెట్టిన పోస్ట్ చూసిన చాలామంది ఇది ప్రభాస్ పర్సనల్ పోస్ట్ లా ఫీలై.. ప్రభాస్ కాబోయే భార్యని పరిచయం చేస్తున్నాడేమో అనే కుతూహలంతో ఎదురు చూసారు. కానీ సినీ విశ్లేషకులు మాత్రం ప్రభాస్ పెళ్లిని కూడా ఆయన అప్ కమింగ్ మూవీ కల్కి 2898 AD ప్రమోషన్స్ కోసం వాడేస్తున్నారంటూ మాట్లాడారు.
సినీ విశ్లేషకులు చెప్పిందే నిజమైంది. ప్రభాస్ చెప్పాలనుకున్న స్పెషల్ వ్యక్తి బుజ్జిని రివీల్ చేసారు మేకర్స్. కల్కి 2898AD చిత్రం నుంచి స్క్రాచ్ వీడియో 4ను మేకర్స్ విడుదల చేశారు. ఆ వీడియో తోనే బుజ్జి పాత్రను పరిచయం చేసారు. నా లైఫ్ అంతే. బాడీ లేకుండా బతికేయాల్సి వస్తుందేమో అంటూ బుజ్జి డైలాగ్ చెప్పగా.. నీ టైమ్ మొదలైంది బుజ్జి అంటూ భైరవ పాత్రధారి ప్రభాస్ ఆ వాహనాన్ని పరిచయం చేయబోయి.. మే 22 వరకు వెయిట్ చెయ్యండి అని చెప్పాడు.
ప్రభాస్ ఇన్‌స్టా పోస్ట్, అలాగే భైరవుడి బుజ్జి ఎవరనే విషయంపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. కల్కి ప్రమోహన్స్ ని డిఫరెంట్ గా మొదలు పెట్టబోతున్నారు. మే 22 న రామోజీ ఫిలిం సిటీలో కల్కి కార్ ఈవెంట్ ని ఓ రేంజ్ లో నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లని మొదలు పెట్టారు. ఇక కల్కి బుజ్జిని రివీల్ చేసిన స్క్రాచ్ వీడియో 4 ని చూసిన అందరూ నాగ్ అశ్విన్ మరో రాజమౌళి అంటూ కామెంట్ చేస్తున్నారు.