సమంత సోషల్ మీడియాలో ఫోటో వదిలింది అంటే చాలు ఆటోమాటిక్ గా ట్విట్టర్ X లో ట్రెండ్ అవుతూ కనిపిస్తుంది. రీ ఎంట్రీ కోసం గ్లామర్ షో చేస్తూ కాస్త హద్దు దాటుతున్న సమంత సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ లో మాత్రం చాలా యాక్టీవ్ గా కనిపిస్తుంది. ఆమె గ్లామర్ షో కొంతమందికి కనువిందుగా కనిపిస్తే.. మరికొంతమంది సమంత పై ఉన్న రెస్పెక్ట్ పోతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.
ప్రస్తుతం సరైన ప్రాజెక్ట్ తో రీ ఎంట్రీ ఇవ్వాలని సమంత వెయిట్ చేస్తుంది. కొత్త ప్రాజెక్ట్ ఏం సైన్ చెయ్యకపోయినా.. సోషల్ మీడియాలో తరచు ఫోటో షూట్స్ తో ఊపేస్తోంది. తాజాగా సమంత పెట్స్ తో ఆడుకుంటూ.. స్టయిల్ గా ఉన్న ఆ ఫోటొస్ ని షేర్ చేసింది.
అంతేకాకుండా కారులో వెళుతుండగా.. ఎదురుగా ఉన్న ఆటో పై తన పిక్ అంటించి ఉన్న వీడియో ని కూడా షేర్ చేసింది. అంతే సమంత సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ కనిపించింది. అంటే ఆమె కొత్త పిక్స్ తోనే సమంత అభిమానులు ఆమెని ఇంతిలా ప్రేమించడం నిజంగా ఆశ్చర్యకర విషయమే. కానీ కొంతమంది ఎప్పుడూ ఫొటోస్ లోనే కనిపిస్తావా.. ఫోకస్ లోకి రావా అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు.