పవన్ కళ్యాణ్ ఫాన్స్ చాలా విషయాల్లో ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ ని టార్గెట్ చేస్తూ విసిగిస్తూ ఉంటారు. రేణు దేశాయ్ ఏది మట్లాడినా ఆమెని ట్రోల్స్ తో చీల్చి చెండాడుతూ ఉంటారు. రేణు దేశాయ్ కూడా పవన్ ఫాన్స్ ని ఊరుకోదు. తన జోలికి వస్తే తాట తీసి ఆరేస్తుంది. తాజాగా రేణు దేశాయ్ ని కెలికిన పవన్ ఫ్యాన్ ఒకరిపై రేణు దేశాయ్ ఫైరయ్యింది.
రీసెంట్ గా రేణు దేశాయ్ తన పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఆపోస్టు కింద ఒక పవన్ ఫాన్ రేణు దేశాయ్ ని మీది కూడా పవన్ కల్యాణ్ లాగే గోల్డెన్ హార్ట్ అంటూ కామెంట్ పెట్టడంతో రేణు దేశాయ్ కి ఒళ్ళు మండింది. నా పోస్టులను ప్రతిసారి నా ఎక్స్ హస్బెండ్ తో ఎందుకు కంపేర్ చేస్తారు.. నాకు పదేళ్ల వయసు నుంచి జంతువులంటే ఇష్టం. నా ఎక్స్ హస్బెండ్ నాలాగా యానిమల్ లవర్ కాదు, దయచేసి నన్ను నన్నులా చూడండి అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది.
అంతేకాదు ఈ కామెంట్ స్క్రీన్ షాట్ పోస్ట్ చేస్తూ.. ఇలాంటి కామెంట్స్ బాధను, ఆవేదనను, ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయని, తన భర్తతో విడిపోయి ఏళ్ళు గడుస్తున్నా.. ఆయన అభిమానులతో తనకి టార్చర్ తప్పడం లేదు, ఇలాంటి వారిని ఎంతోమందిని బ్లాక్ చేసినా.. ఈ బెడద మాత్రం వదలడం లేదు అంటూ రేణు దేశాయ్ చిరాకు పడింది.