పుష్ప పార్ట్ 2 ని ఆగష్టు 15 నే విడుదల చేసేందుకు సుకుమార్ కంకణం కట్టుకున్నారు. అసలు గ్యాప్ లేకుండా డే అండ్ నైట్ పుష్ప పార్ట్2 షూటింగ్ లాగించేస్తున్నారు. ఆఖరికి మలేషియా వెళ్లి షూటింగ్ చేసే సమయం లేక టీమ్.. ఇక్కడే రామోజీ ఫిలిం సిటీలో మలేషియా లొకేషన్స్ సెట్ వేసుకుని షూటింగ్ చుట్టేస్తున్నారు.
ప్రస్తుతం మలేషియా బ్యాక్డ్రాప్ లో వేసిన సెట్ లోనే పుష్ప షూటింగ్ జరుగుతుంది. అయితే ఇప్పుడు సుకుమార్ ని, పుష్ప టీమ్ ని రెండు సమస్యలు వెంటాడుతున్నాయి. అందులో ఒకటి ఫాహద్ ఫాసిల్ డేట్స్ కేటాయించడంలో వెయిటింగ్. ఇప్పటికే ఫాహద్ ఫాసిల్ పార్ట్2 షూటింగ్ పూర్తయినా.. మరో 15 రోజులు డేట్స్ అవసరమవడంతో ఫాహద్ ని అడుగుతున్నారు.
ఆయన ఇతర ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉండడంతో పుష్ప టీమ్ ని వెయిట్ చేయిస్తున్నారు. అసలే పార్ట్ 2 లో ఫహద్ ఫాసిల్ రోల్ చాలా కీలకం. ఇక రెండో సమస్య ఐటెం సాంగ్ కోసం హీరోయిన్ విషయంలో సుకుమార్ ఇంకా ఓ క్లారిటీకి రాకపోవడంతో అల్లు అభిమానుల్లో పుష్ప 2 విడుదలపై ఆందోళన నెలకొంది.
పార్ట్ 1 లో సమంత మాదిరిగా ఈ సీక్వెల్ లో ఐటెమ్ గాళ్ గా ఎవరిని తీసుకోవాలన్న విషయంలో ఓ స్పష్టత రాలేదు. చాలామంది టాప్ హీరోయిన్ పేర్లు పరిశీలించారు. కానీ కుదరడం లేదు. ఇప్పుడు పుష్ప టీం ని ఈ రెండు సమస్యలు ఇబ్బంది పెడుతున్నట్టుగా టాక్.