అదితి రావు ఎప్పుడెప్పుడు సిద్దార్థ్ ని పెళ్లి చేసుకుంటుందా అని ఆమె అభిమానులు చాలా వెయిట్ చేస్తున్నారు. సిద్దార్థ్ తో రహస్యంగా తెలంగాణలోని ఓ పురాతన ఆలయంలో నిశ్సితార్ధం చేసుకున్న అదితి రావు తన నిశ్చితార్ధపు విషయాన్ని తన తల్లి మీడియా కి చెప్పమనడంతో సిద్ధుతో ఎంగేజ్మెంట్ అయినట్టుగా ఓ పిక్ తో అందిరికి తెలియజేసింది.
పెళ్లి విషయంలో ఇంకా ఈ జంట సస్పెన్స్ మైంటైన్ చేస్తుంది. అదలా ఉంటే.. అదితి రావు హీరమండి వెబ్ సీరీస్ తో ఈమధ్యన తరచూ వార్తల్లోనే ఉంటుంది. హీరమండి సీరిస్ ప్రమోషన్స్ లోను అలాగే స్పెషల్ ఫోటో షూట్స్ తో అదితి రావు అదరగొట్టేస్తుంది.
తాజాగా వైట్ చుడిదార్ స్టిల్స్ పోస్ట్ చేసింది. ఎక్కువగా ట్రెడిషనల్ గా కనిపించే అదితి రావు.. ఈ వైట్ మోడ్రెన్ చుడిదార్ లో అందానికే అసూయా పుట్టిస్తుందా అనే మాదిరి కనిపించింది. అదితి మొహం లో ఆ మెరుపు చూస్తుంటే త్వరలోనే సిద్దూతో ఏడడుగులు నడిచేందుకు సిద్దమయ్యిందా అనేలా ఉంది.