ఏపీలో ఎలక్షన్స్ ముగియడంతో జగన్ మోహన్ రెడ్డి భార్య పిల్లలతో సహా లండన్ కి వెళ్లేందుకు కోర్టులో పర్మిషన్ తీసుకుని గత రాత్రి లండన్ కి బయలుదేరి వెళ్లారు. ఫ్యామిలీతో సహా జగన్ ఓ రెండు వారాల పాటు లండన్ లోనే ఉండబోతున్నారు. అయితే జగన్ లండన్ ట్రిప్ పై సోషల్ మీడియాలో తెగ కామెడీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పేదింటి బిడ్డ జగన్, ధనవంతులతో పోరాడుతున్నాడు.. అంటూ తెగడబ్బా కొట్టేవాడు.
తాను పేద బిడ్డని అని చెప్పుకునే జగన్ లగ్జరీ ఫ్లైట్ లో లండన్ కి వెళ్ళాడు. ఆయన వెళ్లిన ఈ ప్రత్యేక విమానంలో పడకలతో పాటు 14 సీట్లు మాత్రమే ఉంటాయి. విమానం అద్దె గంటకు 12 లక్షలు మాత్రమే! ఇది ప్రపంచంలోనే విలాసవంతమైనది. విస్టా జెట్ కంపెనీకి చెందిన బొంబార్డియర్ 7500. నిరుపేద సీఎం కోసం ప్రత్యేకంగా విదేశాల నుంచి ఈ విమానాన్ని తెప్పించారు. గురువారమే గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. శుక్రవారం రాత్రి 11 గంటలకు జగన్ తన కుటుంబంతో కలసి ఈ విమానంలో గన్నవరం నుంచి నేరుగా లండన్ కి బయల్దేరారు.
సీఎం భద్రత కోసం నలుగురు అధికారులు ముందుగానే లండన్ వెళ్లారు. వారికి విమాన టికెట్లు, వసతి, ఇతర ఖర్చులు కలిపి కోటిన్నర మాత్రమే. తరచూ పేదవాడినని చెప్పుకొనే జగన్ సింప్లిసిటీ ఇదన్నమాట. జగన్ భద్రతాధికారులకు అయ్యే ఖర్చు కోటిన్నర ప్రభుత్వమే భరించనుంది. వ్యక్తిగత పర్యటన కావడంతో సీఎం కుటుంబానికి అయ్యే ఖర్చంతా ప్రైవేటు ఖర్చు. ఈ నెల 31న ఆయన రాష్ట్రానికి తిరిగి రానున్నారు.