చందు అలియాస్ చంద్రకాంత్ నిన్న శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. పవిత్ర జయరాం రోడ్ యాక్సిడెంట్ తర్వాత డిప్రెషన్ తో బాధపడుతూ పవిత్ర మరణాన్ని జీర్ణించుకోలేని చంద్రకాంత్ ఇలా ఆత్మహత్య చేసుకున్నాడని అందరూ అనుకుంటున్నారు. పవి నీతో పాటు నేను అంటూ మాట్లాడడం కాదు ఆచరించి చూపిస్తూ తిరిగిరాని లోకాలకి వెళ్లపోయాడు.
చందు ఫ్రెండ్స్ అతన్ని పవిత్ర మృతి బాధలోనుంచి బయటికి తెచ్చెందుకు చాలా కష్టపడ్డారు. కానీ ఫలితం లేకుండా పోయింది. తాజాగా చందు వాట్సాప్ చాట్ ని చందు ఫ్రెండ్స్ పోలీసులకి అందజేశారు. తన స్నేహితులతో తన బాధను చెప్పుకొంటూ, పవిత్ర మరణం నుంచి కోలుకోలేకపోతున్నట్టుగా చెప్పి భోరున ఏడ్చాడు.
పవిత్ర లేని జీవితం నాకు వద్దు.. నేను చనిపోతానని తమ దగ్గర మొరపెట్టుకున్నాడు.. అంటూ అతని స్నేహతులు చెబుతున్నారు. అంతేకాకుండా తన స్నేహితులతో వాట్సాప్ చాట్ లో.. ఈ లోకం నుంచి వెళ్లిపోతున్నాను. ఈ జన్మకు ఇదే సరిపోతుంది అని వాట్సాప్ ద్వారా తెలియజేసినట్టు తెలుస్తున్నది. పవిత్ర లేని జీవితాన్ని కొనసాగించడం కంటే.. నేను వెళ్లిపోతేనే కరెక్ట్.
ఒకవేళ బ్రతికుంటే నేను పిచ్చోడిని అయిపోయి.. లేదా తాగుబోతును అయిపోతాను. ఇంట్లో వాళ్లను ఇబ్బంది పెట్టడం నాకు నచ్చడం లేదు అంటూ చేసిన చాట్ పోలీసులకి ఇచ్చారు చందు స్నేహితులు, చందు ఆత్మహత్య కేవలం పవిత్ర మరణం జీర్ణించుకోలేక చేసుకుంది అంటూ పోలీసులు ప్రాధమిక విచారణలో తేల్చినట్టుగా సమాచారం.