కొన్నాళ్లుగా ఫిట్ నెస్ కి బ్రాండ్ అంబాసిడర్ లా తయారైన కీర్తి సురేష్ సోషల్ మీడియాలో మంచి యాక్టీవ్ ఉంటుంది. తన జిమ్ వీడియోస్, ఫ్రెండ్స్ తో చిల్ అవుతున్న ఫొటోస్, వర్కౌట్స్, యోగాసనాలు వేస్తూ ఇలా కీర్తి సురేష్ సోషల్ మీడియాలో తరచూ సందడి చేస్తూ అభిమానులకి దగ్గరగా ఉంటుంది.
తాజాగా కీర్తి సురేష్ తన ఇన్స్టా పేజీ లో తల్లకిందులుగా యోగాసనం వేసిన వీడియోని షేర్ చేసింది. తన పెట్ తో కలిసి ఉన్న వీడియో ని వదిలింది. జిమ్ డ్రెస్ లో కీర్తి సురేష్ చాలా స్లిమ్ గా కనిపించింది. తల్లకిందులుగా తపస్సు చేస్తున్న కీర్తి సురేష్ అంటూ ఆ వీడియో చూసిన నెటిజెన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
ప్రస్తుతం తమిళ, మలయాళ ఇండస్ట్రీస్ లో బిజీగా వున్న కీర్తి సురేష్ హిందీ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇస్తుంది. అలాగే కీర్తి సురేష్ కొద్దిరోజులుగా గ్లామర్ విషయంలో వెనకడుగు వెయ్యడమే లేదు, అందులోను బాలీవుడ్ కి వెళ్ళాక మరింత గ్లామర్ ని చూపించేస్తుంది.