బుట్టబొమ్మ పూజ హెగ్డే ప్రస్తుతం సౌత్ సినిమాల్లో కనిపించడం లేదు, ఆమెకి సౌత్ సినిమా ఆఫర్ వచ్చిన వార్త కూడా వినిపించడం లేదు. ఒకప్పుడు నాలుగు షిఫ్ట్ ల్లో పని చేసిన పూజ హెగ్డే ఇప్పుడు బాలీవుడ్ సినిమాలకే పరిమితమైంది. విపరీతమైన పాపులారిటీ సంపాదించించి పెట్టిన సౌత్ ఇండస్ట్రీ ఆమెని దాదాపుగా పక్కన పెట్టేసింది అని చెప్పుకుంటున్నారు.
ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఫొటోస్ ని షేర్ చేస్తూ సౌత్ ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తున్న పూజ హెగ్డే నిరీక్షణ ఫలించిందా అంటే అవుననే అంటుంది సోషల్ మీడియా. తమిళ్ లో స్టార్ హీరో సూర్య పక్కన పూజ హెగ్డే కి ఛాన్స్ దొరికింది అనే న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది.
#Suriya 44 లోపూజ హెగ్డే కి సూర్య సరసన చోటు దక్కింది అనే న్యూస్ విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఇదే నిజమైతే పూజ హెగ్డే నిరీక్షణ ఫలించినట్టే, ఆమె అభిమానులు హ్యాపీ అయినట్టే.