సోషల్ మీడియాలో తరచూ కొత్త లుక్స్ ని పోస్ట్ చేస్తూ హడావిడి చేస్తున్న మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల తాజాగా జీన్స్ లుక్ షేర్ చేసింది. జీన్స్ ప్యాంట్ లో స్లీవ్ లెస్ షర్ట్ తో శ్రీలీల మత్తెక్కించే ఫోజులతో మతిపోగొట్టింది. లూజ్ హెయిర్ తో రఫ్ లుక్ లో శ్రీలీల యూత్ ని టార్గెట్ చేసిందా అనేలా కవ్విస్తుంది. శ్రీలీల ఫ్రెష్ లుక్ నెట్టింట్లో సంచలనంగా మారింది.
శ్రీలీల పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో తప్ప మరె ఇతర సినిమా న్యూసుల్లో వినిపించడం లేదు. వరసబెట్టి శ్రీలీలని యూత్ హీరోలంతా డిజ్ పాయింట్ చేసారు మహేష్-తివిక్రమ్ గుంటూరు కారం అయితే శ్రీలీలని కోలుకోకుండా చేసింది. ప్రస్తుతం శ్రీలీల పేరు ఏ హీరో పక్కన కూడా వినిపించడమే లేదు.
నితిన్ సినిమాలో శ్రీలీల ఉందా? అంటే ఏమో అనే సమాధానం వినిపిస్తుంది. మరోపక్క విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి సినిమాలో శ్రీలీల ని ఉంచారో.. తప్పించారో క్లారిటీ లేదు. అలాగే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మళ్ళీ ఎప్పుడు పట్టాలెక్కుతుందో సరైన సమాచారం లేదు. ఇలా ఉంది శ్రీలీల సినిమాల పరిస్థితి.