పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-మహానటి నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన కల్కి 2898 AD చిత్రం జూన్ 27 న విడుదల కాబోతున్నట్టుగా మేకర్లు ప్రకటించడంతో ఇకపై ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అవుతాయంటూ ప్రభాస్ ఫాన్స్ చాలా ఎదురు చూస్తున్నారు. నాగ్ అశ్విన్ ఇంకా సిజి వర్క్ మూడ్ లోనే ఉన్న విషయంలో కాస్త ఆందోళన ఉన్నప్పటికీ.. ప్రస్తుతం కల్కి పై అంచనాలు అభిమానుల ఆందోళనని అధిగమిస్తున్నాయి.
కల్కి లో ఒకే పాట ఉంటుంది అనే ప్రచారంలో నిజం లేదు, కల్కి 2898 AD లో రెండు పాటలుంటాయని తెలుస్తోంది. ఇక కల్కి ప్రమోషన్స్ పై ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మే 22 న రామోజీ ఫిలిం సిటీలో కల్కి 2898 AD కి సంబందించిన కార్ మోడల్ రివీల్ ఈవెంట్ ని భారీ ఎత్తున చేయబోతున్నారట.
ఈ ఈవెంట్ లో ప్రభాస్ అభిమానులు పాల్గొంటారని తెలుస్తోంది. మరి ప్రభాస్ కల్కి చిత్ర ప్రమోషన్స్ రామోజీ ఫిలిం సిటీ నుంచి మొదలై దెశ వ్యాప్తంగా ఉండబోతున్నాయని, నాగ్ అశ్విన్.. కల్కి ప్రమోషన్స్ ని చాలా స్పెషల్ గా ప్లాన్ చేసాడని చెప్పుకుంటున్నారు.