మే 20 యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు. మరి ఎన్టీఆర్ బర్త్ డే అంటే అభిమానులకి పండగ రోజే. అందుకే ఎన్టీఆర్ బర్త్ డే కోసం ఏడాది పొడవునా ఎదురు చూస్తారు. ఎన్టీఆర్ తన భార్య లక్ష్మి ప్రణతితో కలిసి వెకేషన్ కి వెళ్ళిపోయాడు. అభిమానులు మాత్రం ఎన్టీఆర్ లేటెస్ట్ ఫిలిం దేవర నంచి రాబోయే అప్ డేట్ పై క్యూరియాసిటీతో ఉన్నారు.
మే 20 ఎన్టీఆర్ బర్త్ డే కి ఒక రోజు ఉండే అంటే మే 19 నే దేవర చిత్రం నుంచి దేవర ఫస్ట్ సింగిల్ వదులుతున్నట్టుగా మేకర్స్ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేస్తున్నారు. మే 19 న దేవర సింగిల్ కి సంబందించిన ప్రోమోని ఈరోజు వదిలింది టీం. ఎన్టీఆర్ పడవపై సముద్రంలో పవర్ ఫుల్ గా వస్తున్న ఫియర్ సాంగ్ ప్రోమో ని వదిలింది. మధ్యలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ అప్పీరియన్స్ కూడా ప్రోమోలో హైలెట్ చేసారు.
మరి ప్రోమో లో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ లో ఎలా ఉన్నాడో.. ఈ సాంగ్ ప్రోమోలోను అదే గెటప్ లో కనిపించాడు. It's a warning notice from the Lord of Fear 😎 అంటూ దేవర ఫస్ట్ సింగిల్ పై, అనిరుద్ మ్యూజిక్ పై అంచనాలు పెంచేశారు.