డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప నుంచి వస్తున్న ప్రతీ ఒక్క అప్డేట్ అంచనాలు పెంచేస్తోంది. రీసెంట్‌గా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను ముగించేసుకోవడం, ఆ తరువాత డార్లింగ్ ప్రభాస్ సెట్‌లోకి రావడం.. ఇలా ప్రతీ ఒక్క అప్డేట్‌తో కన్నప్ప నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతూనే వస్తోంది. తాజాగా కన్నప్పకు సంబంధించిన మరో అప్డేట్ నెట్టింట్లో వైరల్ కాసాగింది.
కన్నప్ప చిత్రంలోని ఓ కీలక పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ మేరకు నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. ఆల్రెడీ విష్ణు మంచు, కాజల్ కలిసి ఇది వరకు మోసగాళ్లు మూవీని చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇలా మంచు విష్ణు టైటిల్ రోల్‌లో చేస్తోన్న కన్నప్ప చిత్రంలో కాజల్ ఓ కీ రోల్‌ను పోషిస్తున్నారు.
కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ కన్నప్ప చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని ఎక్కువగా న్యూజిలాండ్‌లోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైద్రాబాదలో జరుగుతోంది. మే 20న కేన్స్‌లో జరిగే ఫిల్మ్ ఫెస్టివల్‌లో కన్నప్ప టీజర్‌ను లాంచ్ చేయబోతోన్న సంగతి తెలిసిందే.