సత్య దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణమ్మ గత శుక్రవారమే ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఆడియన్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ రాబట్టిన కృష్ణమ్మ చిత్రం వారం తిరిగేలోపులో బ్రేక్ ఈవెన్ అంటూ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటిచారు. అంతా బాగానే ఉంది. సత్యదేవ్ కూడా కృష్ణమ్మ రిజల్ట్ పై కూల్ గానే ఉన్నాడు.
కృష్ణమ్మ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఫ్యాన్సీ డీల్ తో చేజిక్కించుకుంది. అయితే ఈమధ్య కాలంలో సక్సెస్ అయిన చిత్రాలైనా, లేదంటే ప్లాప్ చిత్రాలైన ఓ నెల గడువుతోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. మరీ అట్టర్ ప్లాప్ అయిన సినిమా మూడు వారాలకి ఓటీటీలోకి దిగుతుంది.
కానీ కృష్ణమ్మ విడుదలైన వారం లోనే అమెజాన్ ప్రైమ్ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ లోకి రావడమనేది నిజంగా షాకిచ్చే విషయం. కృష్ణమ్మ బాక్సాఫీస్ రిజల్ట్ ఎలాగైనా ఉండొచ్చు. కానీ మరీ ఏడో రోజే ఇలా స్ట్రీమింగ్ కి ఇచ్చేయడం అనేది ఎవరికీ అర్ధం కావడం లేదు. మరోపక్క తెలంగాణా వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ పదిరోజుల పాటు మూతబడ్డాయి. ఇలాంటి సమయంలో కృష్ణమ్మ మేకర్స్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడమనేది షాకిచ్చే అంశం.