పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఏం చెప్పబోతున్నాడు, ఎందుకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు, డార్లింగ్స్ ఓ స్పెషల్ వ్యక్తి మన జీవితంలోకి రాబోతున్నారు, వెయిట్ చెయ్యండి అంటూప్రభాస్ పెట్టిన పోస్ట్ చూసిన డార్లింగ్ అభిమానులు ఎంత ఎగ్జైట్ అవుతున్నారో చెప్పనలవి కాదు.
40 ఏళ్ళు దాటినా పెళ్లి చేసుకోకుండా ఇంకా బ్యాచిలర్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ పెళ్ళెప్పుడు చేసుకుంటాడా.. అసలు చేసుకుంటాడో లేదో.. అని ఆయన కుటుంబంతో పాటుగా ఆయన అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ పెళ్లిపై ప్రతి ఏడాది ప్రభాస్ బర్త్ డే రోజున న్యూస్ రావడం, తర్వాత ఫాన్స్ డిస్పాయింట్ అవడం చూస్తున్నాం.
మరి ప్రభాస్ తన లైఫ్ లోకి రాబోయే స్పెషల్ వ్యక్తి ఎవరు అనేది ఎప్పుడు చెబుతారో అనే విషయంలో ఇప్పుడు అభిమానుల్లో విపరీతమైన క్యూరియాసిటీ నడుస్తుంది.