సీరియల్ నటులే కాదు, సినిమా సెలబ్రిటీస్ కూడా ఈమధ్యన పెళ్లిళ్లు ఎంత వేగంగా.. అంటే ప్రేమించుకుని పెద్దల ని ఒప్పించి పెళ్ళికి సిద్దమైపోతున్నారో అంతే వేగంగా లైఫ్ పార్ట్నర్ తో విడిపోవడానికి ఆలోచించడం లేదు. 10 నుంచి 20 ఏళ్ళు కాపురం చేసిన జంటలే మనస్పర్ధలతో విడిపోతుంటే లేదు కానీ.. నాలుగేళ్లు కాపురం చేసిన మేము విడిపోతే వచ్చిందా అన్నట్టుగా తయారయ్యారు చాలామంది.
రీసెంట్ గానే కోలీవుడ్ హీరో కమ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ భార్య తో విడిపోతున్నట్టుగా ప్రకటించిన తర్వాత వెంటనే సీరియల్ నటి ఒకరు భర్త తో సపరేట్ అవుతున్నట్టుగా ప్రకటించడం బుల్లితెర ప్రేక్షకులకి షాకిచ్చింది. మొగలి రేకులు సీరియల్ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చిన శిరీష్.. ప్రస్తుతం పలు సీరియల్స్ లో మెయిన్ కేరెక్టర్స్ లో కనిపిస్తుంది. కెరీర్ లో బిజీగా ఉంటున్న శిరీష్ భర్త నవీన్ తో విడిపోతున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.
నేను నా భర్త నవీన్ విడాకులు తీసుకుని విడిపోతున్నాం, మా నియంత్రణలో లేని కొన్ని పరిస్థితుల వలన మేము విడిపోవాలనుకున్నాము, ఇలాంటి కష్ట సమయంలో మమ్మల్ని అర్ధం చేసుకుంటారని, మా నిర్ణయాన్ని మీరు గౌరవిస్తారని మేము అనుకుంటున్నాము, వీలయితే సపోర్ట్ చెయ్యండి, విమర్శించకండి, నవీన్ అంటే నాకు ఇప్పటికి గౌరవం ఉంది.
నేను ఒక సెలెబ్రిటీ అయినందున ఈ విషయాన్ని మీకు చెప్పాలనిపించింది. చెప్పాను. నన్ను సపోర్ట్ చెయ్యకపోయినా పర్లేదు. కానీ ట్రోల్స్ చెయ్యకండి అంటూ శిరీష సోషల్ మీడియా పోస్ట్ తో తన విడాకుల విషయాన్ని తెలియజేసింది.