ఒకే ఒక్క ట్వీట్.. అటు రాజకీయాల్లో.. ఇటు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. మెగా బ్రదర్, జనసేన కీలక నేత కొణిదెల నాగబాబు ఎన్నికల తర్వాత ట్విట్టర్ వేదికగా.. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడు అయినా పరాయి వాడే, మాతో నిలబడే వాడు పరాయివాడైనా మా వాడే! అని చేసిన ఒకే ఒక్క ట్వీట్ ఇప్పుడు ఏకంగా నాగబాబు ట్విట్టర్ అకౌంట్ మూసేసుకునే అదెనబ్బా డీయాక్టివ్ చేసుకోవాల్సిన పరిస్థితికి పోయింది. చూశారుగా.. కోపంలోనో, ఆలోచన చేయకుండా చేసిన ట్వీట్ ఏ పరిస్థితికి తెచ్చిందో..!
అసలేం జరిగింది..?
మిత్రుడు, ఆప్తుడు.. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అక్కడికి వెళ్లి మరీ చిన్నపాటి ప్రచారమే చేశాడు. అంతే కాదు మీడియాతో మాట్లాడుతూ.. మిత్రుడిని భారీ మెజారిటీతో గెలిపించాలని అభిమానులు, నియోజకవర్గ ప్రజలను కోరారు. దీంతో ఒక్కసారిగా శిల్పా రవి ఇంటిచుట్టూ వేలాది మంది అల్లు అర్జున్ ఫ్యాన్స్, వైసీపీ నేతలు, కార్యకర్తలతో నిండిపోయింది. అదేరోజు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా నంద్యాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించినా జనాలు పెద్దగా కనబడని పరిస్థితి. సీన్ ఎలా ఉందనేది అర్థమయ్యింది కదా. ఇక అప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించాలని పిఠాపురం ప్రజలను ట్విట్టర్ వేదికగా కోరారు. ఐతే.. ఇక్కడ మేనమామ, ఫ్యామిలీ మెంబర్ కోసం ఒక్క ట్వీట్ చేసి.. అటు మిత్రుడు కోసం నంద్యాలకు వెళ్లడాన్ని.. మెగా ఫ్యామిలీ అస్సలు జీర్ణించుకోలేక పోయింది. సరిగ్గా అప్పుడే మెగా vs అల్లు ఫ్యాన్స్ గా సోషల్ మీడియా వేదికగా పేలుతున్నాయి. పచ్చి బూతులు తిట్టుకున్న పరిస్థితి. అసలు అల్లు ఫ్యామిలీ లేకపోతే మెగా ఫ్యామిలీ ఎక్కడిది.. అని టార్గెట్ చేస్తూ ట్వీట్స్ చేశారు బన్నీ ఫ్యాన్స్.
దుమ్మెత్తి పోశారుగా..!
వాస్తవానికి బన్నీకి ఉండే పీఆర్ టీమ్, సోషల్ మీడియా వింగ్ బడా హీరోలకే లేదు. ఇది ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా అక్షరాలా నిజం. అలాంటిది నాగబాబు.. తననే ఉద్దేశించి చేశారని అల్లు అర్జున్ అనుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.. ఇక సోషల్ మీడియా టీమ్ ఎంతలా యాక్టివ్ అవుతుందో అబ్బో మాటల్లో చెప్పలేం. అదీ సంగతి. సరిగ్గా ఇదే టైములో .. అల్లు రామలింగయ్య అనే వ్యక్తి లేకపోతే నాగబాబు అనేవాడు బాపట్ల పోస్టాఫీస్ వద్ద సైకిల్ షాప్ లో పంక్చర్లు వేసుకునేవాడు అనే ట్వీట్ అల్లు అర్జున్ పోస్ట్ చేసినట్టు వైరల్ కావడంతో రచ్చ రచ్చగా మారింది. దీంతో అటు బూతులు.. ఇటు ఒక రేంజిలో విమర్శలు.. అల్లు అర్జున్ పేరిట వైరల్ అవుతున్న ట్వీట్ తో తల పట్టుకున్న నాగబాబు చేసేదేమీ లేక ఏకంగా అకౌంట్ ను డీయాక్టివ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదో ట్వీట్ అంతే కదా.. ఇంత దూరం వెళ్లదు.. ఈ సిట్యుయేషన్ వస్తుందని నాగబాబు కలలో కూడా ఊహించి ఉండడేమో..! చూశారుగా.. అల్లు అర్జున్ దెబ్బ.. నాగబాబు అబ్బ అన్నారుగా..! ఇది ఇప్పట్లో ఐతే సద్దుమనిగేలా కనిపించట్లేదు.. ఎంత వరకు వెళ్తుందో చూడాలి మరి.