2019 ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యంగా అమరావతి రాజధానిని కాదని మూడు రాజధానులంటూ కొత్త ఆటకి తెర తీసాడు. అందులో భాగంగానే అమరావతిలో కట్ట మీదున్న ప్రజా వేదికని కూల్చడంతో తన పని మొదలు పెట్టాడు. ఆ తర్వాత అమరావతిని నామ రూపాల్లేకుండా చేస్తాను అన్నట్టుగానే జగన్ మూడు రాజధానుల్లో భాగముగా పరిపాలన రాజధానిగా విశాఖని ప్రకటించాడు.
అప్పటినుంచి ఇదిగో విశాఖ వెళుతున్నాం, అక్కడి నుంచే పరిపాలన.. అదిగో విశాఖ వెళుతున్నాం అక్కడి నుంచే ఇకపై ఏపీ పరిపాలన అంటూ మభ్యపెడుతూనే ఉన్నారు. దసరాకి, సంక్రాంతికి, ఉగాది ఇలా పండగలు వస్తున్నాయి.. పోతున్నాయి కానీ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి వదిలి విశాఖ వెళ్లి పరిపాలన చేసింది లేదు, ఏమి లేదు.
ఇప్పుడు కూడా జగన్ మరోసారి సీఎం అవుతాడు. ఈసారి జగన్ వైజాగ్ లోనే మరోసారి సీఎం గా ప్రమాణశ్వీకారం అంటున్నారు. అనడం కాదు.. జగన్ క్యాబినెట్ లో మంత్రిగా చేసిన బొత్స సత్యన్నారాయణ ప్రెస్ మీట్ పెట్టి జూన్ 9న విశాఖలో రెండవ సారి సీఎంగా @ysjagan గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అంటూ చెప్పడం చూసిన ఏపీ ప్రజలు ఎన్నిసార్లు మాయ చేస్తారు అంటూ కామెడిగా కామెంట్ చేస్తున్నారు.
నిజమేగా పరిపాలన రాజధాని విశాఖ పేరు చెప్పి అక్కడి భూముల రేట్లు పెంచేసిన జగన్.. అమరావతిని ఎండపెట్టి వేడుక చూసాడు. మళ్ళీ రాజధాని విశాఖ అంటూ అక్కడే సీఎం గా జగన్ ప్రమాణస్వీకారం అంటే కామెడీ కాక ఇంకేమవుతుంది.