అందాలతార, మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ చేతికి ఏమైంది. ఐష్ తన కుడి చేతికి కట్టు వేసుకుని కనిపించడంతో, ఆమె చెయ్యి విరగడంతో ఐష్ తన చేతికి కట్టవేసుకుందా.. లేదంటే మారేదన్నా జరిగిందా అనే ఆరాలో ఆమె అభిమానులు ఉన్నారు. మణిరత్నం దర్శకత్వంలో పొన్నియిన్ సెల్వన్ మూవీతో ప్రేక్షకులను అలరించిన ఐశ్వర్య రాయ్ ఆతర్వాత ఎలాంటి ప్రాజెక్ట్ ఒప్పుకొలేదు.
ఐశ్వర్య తన భర్త అభిషేక్ బచ్చన్ తో విడిపోతుంది అంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ ఈమధ్యన తమ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్, కూతురు ఆరాధ్యతో ఉన్న పిక్స్ షేర్ చేసి.. విడాకుల రూమర్స్ కి చెక్ పెట్టింది. తాజాగా ఐశ్వర్యా రాయ్ తన కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో పాటు గత రాత్రి కేన్స్‌కు వెళ్లేందుకు ముంబై విమానాశ్రయంలో కనిపించింది.
అక్కడ ఆమె చేతి గాయాన్ని చూసి అందరూ ఒకింత షాక్ అయ్యారు. పక్కనే ఉన్నవారు ఆమెని అడగగా ఐశ్వర్య మాత్రం సంయమనాన్ని పాటిస్తూ ఎవరు ఏమి అడిగినా చెప్పడానికి నిరాకరించింది, దీనితో అభిమానులు ఆ గాయంతో రెడ్ కార్పెట్ ఐష్ పైన ఎలా నడుస్తుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఐశ్వర్యా రాయ్ కి ఆ దెబ్బ ఎందుకు తగిలిందోనని ఆరా తీస్తున్నారు.