వేసవి సెలవలన్నీ ఎన్నికల వేడిలో కలిసిపోయాయి. ప్రతి వేసవిలో స్టార్ హీరోల సినిమాల్తో పాటు గా, మీడియం రేంజ్, పాన్ ఇండియా ఫిలిమ్స్, చిన్న సినిమాల విడుదలతో వేసవి బాక్సాఫీసు కళకళలాడేది. కానీ ఈ ఏడాది బాక్సాఫీసు బోరుమంది, ప్రేక్షకులు వేసవి తాపంతో కొత్త సినిమాలు లేక బాగా నిరాశపడ్డారు.
గత మూడు నెలలుగా వారానికి నాలుగైదు చిన్న సినిమాలు వచ్చినా అందులో ఒకటో అరో తప్ప ఏ సినిమా ప్రేక్షకులని ఇంప్రెస్స్ చెయ్యలేదు. అవన్నీ ఒక ఎత్తు రేపు రాబోయే శుక్రవారం మరో ఎత్తు. అసలు తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మొత్తం బంద్ ,. అందుకే ఈవారం ఏ సినిమా కూడా విడుదల కావడం లేదు.
ఒకటి రెండు సినిమాలు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవుతున్నాయి తప్ప.. రేపు శుక్రవారం ఏ సినిమా విడుదల కాకపోవడం, తెలంగాణ వ్యాప్తంగా థియేటర్స్ బంద్ ఉండడంతో ప్రేక్షకులు చాలా బోర్ ఫీలవుతున్నారు. అసలు వేసవి సెలవల్లో ఇలాంటి శుక్రవారం ఇప్పటివరకు ప్రేక్షకులు కూడా చూసి ఉండరేమో.. అన్నంతగా ఈ శుక్రవారం కనిపించింది.
చాలామంది మూవీ లవర్స్ వేసవి లో ఇలాంటి శుక్రవారమా.. అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక మే 31 న విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, కాజల్ అగర్వాల్ సత్యభామ లాంటి కాస్త క్రేజ్ ఉన్న సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.