ఇండియన్ 2 సినిమా విడుదల తేదీ ఇవ్వకుండా శంకర్ ఇంకా మేకర్స్ నాన్చుతూనే ఉన్నారు, జూన్ నుంచి ఇండియన్ 2 అయితే విడుదల వాయిదా పడింది. అది జులై 13 కి మారింది అనే ప్రచారమే తప్ప మేకర్స్ మాత్రం ఆ విషయం పై మాట్లాడడం లేదు. ఇండియన్ 2 విడుదలైతే తప్ప రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కి మోక్షం కలగదు.
రామ్ చరణ్-శంకర్ కలయికలో దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రం ఈ డాదిలోనే విడుదలవుతుంది పక్కా అని దిల్ రాజు, రామ్ చరణ్ చెప్పారు. ఇప్పుడు కూడా ఈ నెల నాలుగో వారం నుంచి గేమ్ చేంజ్ ప్రమోషన్స్ మొదలు కాబోతున్నాయని అంటున్నారు. ప్రమోషన్లకు సంబంధించి టీమ్ పక్కా ప్లాన్ తో షెడ్యూల్ కూడా వేసుకుందని టాక్.
గేమ్ ఛేంజర్ నుంచి ముందుగా సాంగ్స్ అండ్ ప్రోమోస్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు అని అంటున్నారు. మరి ఇండియన్ 2 విడుదల కాకుండా శంకర్ ఇలాంటి ప్లాన్స్ చేస్తారా అనే అనుమానం మాత్రం మెగా అభిమానుల్లో బాగానే ఉంది. ఎందుకంటే గేమ్ ఛేంజర్ విడుదల తేదీపై మెగా ఫాన్స్ వెయిట్ చేసినట్టుగా ఏ హీరో ఫాన్స్ వెయిట్ చేసి ఉండరు.