Advertisementt

జాన్వీ కాబోయే భర్తకి ఉండాల్సిన లక్షణాలు

Thu 16th May 2024 12:51 PM
janhvi kapoor  జాన్వీ కాబోయే భర్తకి ఉండాల్సిన లక్షణాలు
Qualities that Janhvi should have in a future husband జాన్వీ కాబోయే భర్తకి ఉండాల్సిన లక్షణాలు
Advertisement
Ads by CJ

కొద్దిరోజుల్లో సౌత్ లో సెన్సేషనల్ హీరోయిన్ గా మారనున్న జాన్వీ కపూర్ ప్రస్తుతం హిందీలో రాజ్ కుమార్ రావు తో కలిసి నటించిన మిస్టర్ అండ్ మిస్సెస్ మహి విడుదలకు సిద్దమవుతుంది. ఆ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా జాన్వీ కపూర్ తన కెరీర్ విషయాలనే కాదు పర్సనల్ విషయాలను కూడా పంచుకుంటుంది. 

శిఖ‌ర్ ప‌హారియా తో కొన్నాళ్లుగా జాన్వీ కపూర్ డేటింగ్ చేస్తుంది అనే రూమర్ ఉంది. త్వరలోనే జాన్వీ కపూర్-శిఖ‌ర్ ప‌హారియా లు వివాహం కూడా చేసుకోబోతున్నారని కూడా బాలీవుడ్ మీడియా కోడైకూస్తోంది. రీసెంట్ గా జాన్వీ కపూర్ తన పెళ్లి తిరుపతిలో చేసుకోబోతుంది. అది కూడా తల్లి శ్రీదేవి చీర ధరించి అంటూ వస్తున్న రూమర్స్ పై ఫైర్ అయ్యింది కూడా. తాజాగా ఆమె తనకు కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాలను బయటపెట్టింది. 

తనకు కాబోయే భర్తలో నిరాశ‌నిస్పృహ‌లు సంద‌ర్భాన్ని బ‌ట్టి ఉండాలి త‌ప్ప‌, ఎప్పుడూ మూడీగా, ఆలోచిస్తూ ఉండ‌కూడ‌దు, త‌ను భాధ‌లో ఉన్న‌ప్ప‌డు ఓదారుస్తూ దైర్యం చెప్ప‌గ‌లగాలి, ప్ర‌తీ విష‌యంలో తనకు అండ‌గా నిల‌వాలి. ఇవ‌న్నీ తాను చేసుకోబోయే వాడిలో ఉండాల్సిన లక్షణాలు అంటూ జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది.  

Qualities that Janhvi should have in a future husband:

Janhvi Kapoor opens up on what she looks for in a partner

Tags:   JANHVI KAPOOR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ