నిన్నటివరకు హిందుపూర్ లో ఒంటరిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాలకృష్ణకి ఆయన భార్య వసుంధర అండగా నిలిచారు. చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ బాలయ్య నియోజకవర్గానికి రాలేదు. అయినప్పటికి బాలయ్య హిందూపురంలో ప్రతి సందు గొంతులో ప్రచారం చేస్తూ కనిపించారు. తొడకొట్టారు, ప్రజల్లో హుషారుని నింపారు.
ఇక పోలింగ్ డే రోజున కూడా టీడీపీ టవల్ తో బాలయ్య ఓటు వేసి అందరికి షాకిచ్చారు. ఇక ఎన్నికలు ముగియడంతో బాలయ్య వర్క్ మూడ్ లోకి వచ్చేస్తున్నారు. బాలకృష్ణ-బాబీ కలయికలో తెరకెక్కుతున్న NBK 109 మూవీ షూటింగ్ ని ఏప్రిల్ లో పక్కనబెట్టి బాలయ్య రాజకీయ ప్రచారంలోకి దిగారు.
NBK 109 చిత్రం నుంచి మహా శివరాత్రికి వదిలిన పవర్ ఫుల్ గ్లిమ్ప్స్ మాస్ ఆడియన్స్ ని ఊపేసాయి. ఉగాదికి NBK 109 టైటిల్ వస్తుంది అనుకుంటే మేకర్స్ ఆ టైటిల్ వదలకుండా నందమూరి అభిమానుల్ని నిరాశపరిచారు. ఇక బాలయ్య మళ్ళీ NBK 109 సెట్స్ మీదకొస్తే.. జూన్ 10 న బాలయ్య బర్త్ డే కి దర్శకుడు బాబీ టైటిల్ తో పాటుగా పవర్ ఫుల్ టీజర్ కూడా సిద్ధం చేస్తున్నారట. మరి జూన్ 10 బాలయ్య బర్త్ డే కోసం అప్పుడే నందమూరి అభిమానులు వెయిట్ చెయ్యడం స్టార్ట్ చేసేసారు.