అల్లు అర్జున్ ట్విటర్ X హ్యాక్ అయ్యిందా.. లేదంటే అల్లు అర్జున్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఇలాంటి పోస్ట్ రావడమేమిటి.. ఇప్పుడు అల్లు అర్జున్ ట్విట్టర్ X ఓపెన్ చేస్తే ఆ ట్వీట్ కనిపించడమే లేదు. కాని అల్లు అర్జున్ తన ట్విట్టర్ X నుంచి నాగబాబు ని అన్నమాట వింటే మెగా ఫాన్స్ అల్లు అర్జున్ ని నిలువునా చీరేస్తారు. అది నిజం.
అల్లు అర్జున్ ట్విట్టర్ X లో అల్లు రామలింగయ్య అనే వ్యక్తి లేకపోతే నాగబాబు అనే వాడు బాపట్ల పోస్ట్ ఆఫీస్ ఎదురు సైకిల్ షాపులో పనిచేసుకునే వాడు అంటూ ట్వీట్ చేసినట్టుగా ఓ ప్రింట్ స్క్రీన్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గత వారం రోజులుగా అల్లు అర్జున్ పై జనసైనికులు, మెగా అభినులు గుర్రుగా ఉన్నారు.
పవన్ కళ్యాణ్ ని వదిలేసి మిత్రుడికి అది కూడా పగ పార్టీకి సపోర్ట్ చేస్తావా అంటూ అల్లు అర్జున్ ని ఆడుకుంటుంటే.. నాగబాబు తన సోషల్ మీడియాలో మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే..! అని ట్వీట్ చేసింది అల్లు అర్జున్ ని ఉద్దేశించే అంటుంటే..
ఇప్పుడు సడన్ గా అల్లు అర్జున్ ట్విటర్ X లో ఇలాంటి పోస్ట్ కనిపించడం, అది ఇప్పుడు కనిపించకపోవడమనేది చాలామందిని అయోమయానికి గురి చేస్తుంది. అసలు అల్లు అర్జున్ ట్విటర్ X హ్యాక్ అవ్వకపోతే, అల్లు అర్జున్ ఇలాంటి చిల్లర ట్వీట్స్ వేసే రకం కాదు, ఎవరో కావాలనే ఇలా చేసి అల్లు అర్జున్ ని ఇరికిస్తున్నారు అంటూ అల్లు ఫాన్స్ తలకొట్టుకుంటున్నారు.