యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం భార్య ప్రణతితో కలిసి స్నేహితులతో విదేశాల్లో జరుపుకునేందుకు వెకేషన్ ప్లాన్ చేసుకుని నిన్న మంగళవారం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కి వచ్చారు. ఎన్టీఆర్ దుబాయ్ వెళ్లాడా.. లేదంటే మారేదన్నా దేశమా అనేది క్లారిటీ లేకపోయినా ఆయన ప్రస్తుతం బర్త్ డే వెకేషన్ మూడ్ లో అయితే ఉన్నాడు.
ఎన్టీఆర్ అభిమానులని ఆదుకోవడంలోనూ, సేవా కార్యమాలకి విరాళాలు ఇవ్వడంలో ఎప్పుడూ ముందుటాడు. తాజాగా ఆయన ఓ చిన్న గుడి కోసం పెద్ద మొత్తంలో విరాళం ఇవ్వడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జగ్గన్నపేట లో ఏర్పాటు చేసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఆలయ నిర్మాణం మరియు ప్రహరీ గోడ నిర్మాణం కోసం12.50 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చాడట.
ఎన్టీఆర్ ఇచ్చిన విరాళం గురించి గుడి నిర్వాహకులు శిలా పలకం ఏర్పాటు చేసి దానిపై ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి దంపతులు, అభయ్ రామ్, భార్గవ్ రామ్, తల్లి షాలిని పేర్లని రాయడంతో.. ఎన్టీఆర్ అభిమానులు దాన్ని ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎన్టీఆర్ గొప్ప మనసుని పొగిడేస్తున్నారు.