Advertisementt

అల్లు అర్జున్ మనసులో దురుద్దేశం లేదు

Wed 15th May 2024 04:39 PM
allu arjun  అల్లు అర్జున్ మనసులో దురుద్దేశం లేదు
There is no malice in Allu Arjun mind అల్లు అర్జున్ మనసులో దురుద్దేశం లేదు
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ సొంత ఇంట్లో మావయ్య కి ప్రచారం చెయ్యకుండా ఫ్రెండ్ కోసం నంద్యాల వెళ్లి వైసీపీ తరపున ప్రచారం చెయ్యడంపై సోషల్ మీడియాలో విపరీతంగా రచ్చ నడిచింది.  అల్లు అర్జున్ ముందుగా మా మావయ్య పవన్ కళ్యాణ్ గారికే నా మద్దతు. కానీ స్నేహితుడి కోసం వెళ్ళాను, ఎపుడో మాటిచ్చాను అని చెప్పినా అల్లు అర్జున్ ని వదలడం లేదు. 

నిన్న నాగబాబు కూడా సోషల్ మీడియా వేదికగా వేసిన ట్వీట్ అల్లు అర్జున్ ని ఉద్దేశించే అంటూ మరిన్ని విమర్శలు వచ్చాయి. మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే...! అని నాగబాబు వేసిన ట్వీట్ అల్లు అర్జున్ ని ఉద్దేశించింది అన్నారు. అయితే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కి మద్దతుగా మాట్లాడేవారు ఉన్నారు. 

2019 లోనే అల్లు అర్జున్ జనసేనకు రెండు కోట్ల విరాళం అందించాడు. అలాంటిది ఆయన జనసేనకు వ్యతిరేఖి ఎలా అవుతాడు. అల్లు అర్జున్  కి అత్యంత సన్నిహితుడు బన్నీ వాస్ కానివ్వండి, ఆయన కాంపౌండ్ లో ఉండే SKN కానివ్వండి అందరూ జనసేనకు పని చేస్తున్నారు. గీత ఆర్ట్స్ నుంచి వెళ్లినవారంతా జనసేనకు సపోర్ట్ చేస్తూ ప్రచారం చేసారు. నాగబాబు వేసిన ట్వీట్ తనను ఉద్దేశించి అని అల్లు అర్జున్ ఇప్పటికీ అనకోవడం లేదట.. అంటూ ట్వీట్లు పెడుతున్నారు. 

There is no malice in Allu Arjun mind:

Nagababu vs Allu Arjun

Tags:   ALLU ARJUN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ