ఏపీలో ఎలక్షన్స్ ఘట్టం దిగ్విజయంగా ముగిసింది. గత రెండు నెలలుగా నేతలంతా ప్రజల మధ్యన తిరిగేందుకు నానా కష్టాలు పడ్డారు. ఒకరు బస్సు యాత్ర, మరొకరు బహిరంగ సభలంటూ ఏపీ మొత్తం ప్రచారం తో హోరెత్తింది. జగన్, చంద్రబాబు, పవన్ అవిశ్రాంతంగా శ్రమించారు. 2024 ఎన్నికలు చివరి ఎన్నికలు అన్నట్టుగా కష్టపడ్డారు. ఎండని, వర్షాన్ని కూడా లెక్క చెయ్యలేదు.
ఇక సోమవారం ఎన్నికలు పోలింగ్ కూడా ముగియడంతో జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రిలాక్స్ అవుతారనే అనుకున్నారు. కానీ చంద్రబాబు - పవన్ నరేంద్రమోడీ నామినేషన్ కార్యక్రమం కోసం వారణాసి వెళ్లారు. అక్కడి నుంచి పవన్ భార్యతో కలిసి కాశీవిశ్వేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇక చంద్రబాబు కూడా తీర్థయాత్రలన్నట్టుగా పలు దేవాలయాలను దర్శించుకోనున్నారు.
రేపు ఉదయం చంద్రబాబు మహారాష్ట్ర వెళ్లనున్నారు. కొల్హాపూర్ లోని శ్రీ మహాలక్ష్మీ ఆలయాన్ని సందర్శించనున్న చంద్రబాబు ఆ తర్వాత అంటే రేపు మధ్యాహ్నం అటునుంచి అటే షిరిడికి వెళ్లనున్నారు. షిర్డీ సాయిబాబాను దర్శించుకొనున్న చంద్రబాబు.. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ కి వచ్చేస్తారు.
ఇక జగన్ మోహన్ రెడ్డి తన కుమర్తెలని చూసేందుకు లండన్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుని కోర్టులో అనుమతి కూడా తీసుకుని ఈ నెల 17న జగన్ భార్య, కుమార్తెలతో పాటుగా లండన్ కి బయలుదేరుతున్నారు. ఈ నెల 31 వరకు జగన్ ఫ్యామిలీతో సహా లండన్ లోనే ఉండనున్నారు. అందుకే అనేది జగన్ విహార యాత్ర-చంద్రబాబు తీర్ధ యాత్ర అని..!