ఎన్టీఆర్ బర్త్ డే వచ్చేసింది. మే 20 కి సమయం ఆసనమైంది, యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే కోసం ఆయన అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు. మరొక్క ఐదు రోజుల్లో ఎన్టీఆర్ పుట్టిన రోజు, అభిమానులు అప్పుడే సంబరాలకు సిద్ధమైపోయారు. ఎన్టీఆర్ కూడా భార్య ప్రణతితో కలిసి బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం వెకేషన్ కి వెళ్ళిపోయాడు.
ఇక దేవర నుంచి ఫస్ట్ సింగిల్ అంటూ మేకర్స్ ఎప్పుడో అప్ డేట్ ఇచ్చేసారు. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ బర్త్ డే కి దేవర నుంచి టైటిల్ సాంగ్ రెడీ చేస్తున్నారట మేకర్స్. ఇప్పటికే లిరికల్ వీడియో ఒక వెర్షన్ కట్ చేసారు. మరోటి కూడా చేస్తున్నారు.
ఈ రెండిటిలో ఏదో ఒకటి టైమ్ కు రెడీ అయితే మే 20 సాంగ్ వదులుతారట.
లేదు అంటే ఎన్టీఆర్ బర్త్ డే కి దేవర నుంచి స్పెషల్ ప్రోమో వదిలేందుకు రెడీ అవుతున్నారనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. దేవర నుంచి ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ గా సాంగ్ లేదంటే ప్రోమోతో ఎన్టీఆర్ ఫాన్స్ కి ట్రీట్ ఇచ్చేందుకు కొరటాల సిద్ధం చేస్తున్నారు.