సింగర్ నోయెల్-నటి ఎస్తర్ ఇద్దరూ కొన్నాళ్ళు సీక్రెట్ గా ప్రేమించుకుని తర్వాత పెద్దల అంగీకారంతో క్రిస్టియన్ పద్దతిలో వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. ప్రేమతో పెళ్లి చేసుకుని పట్టుమని 15 రోజులు గడవకముందే ఇద్దరూ మనస్పర్ధలతో విడిపోయినప్పటికీ.. ఆ విషయాన్ని ఎవ్వరికి తెలియకుండా దాచేసారు.
తర్వాత విడాకులకు అప్లై చెయ్యడం, విడాకులు మంజూరయ్యాక నోయల్, ఎస్తర్ విడివిడిగా విడాకుల విషయాన్ని బయటపెట్టారు. ఆతర్వాత నోయల్ బిగ్ బాస్ లో విడాకుల విషయంతో సింపతీ క్రియేట్ చేసుకున్నాడని ఎస్తర్ తరచూ ఆరోపిస్తూ ఉంటుంది. అయితే ఆమె కూడా విడాకుల విషయంపై మాట్లాడేందుకు ఇష్టపడకపోయినా.. ఈమధ్యన నోయల్ తో ఆమెకున్న విభేదాలను బయటపెడుతుంది.
పలు ఇంటర్వ్యూలో ఆమె నోయల్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేస్తుంది. పెళ్లైన 16 రోజులకే నోయల్ ఎలాంటివాడో అనేది అతని నిజస్వరూపం తెలుసుకున్నా. అందుకే నోయెల్ నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నా. ఈ కారణంగానే అంత త్వరగా విడాకులు తీసేసుకున్నాను, విడాకులు తీసుకున్నాక నోయెల్ నాపై విష ప్రచారం చేసాడు. దీనిపై నాకు ఎప్పుడూ మాట్లాడాలని అనిపించలేదు.
బిగ్ బాస్ లో సింపతీ కోసం మా విడాకుల విషయం బయటపెట్టాడు, అప్పుడే ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని నాకు అనిపించింది. నోయల్ నా గురించి బ్యాడ్‌గా మాట్లాడుతూ చేసిన దానికి అందరూ నాదే తప్పు అనుకున్నారు. అప్పుడు నన్ను చాలామంది ట్రోల్ చేసారు.. అంటూ ఎస్తర్ నోయల్ గురించిన అసలు నిజాలని బయటపెట్టింది.