Advertisementt

ఆంధ్రలో వైసీపీ అరాచకం

Wed 15th May 2024 12:10 PM
ycp  ఆంధ్రలో వైసీపీ అరాచకం
YCP anarchy in Andhra ఆంధ్రలో వైసీపీ అరాచకం
Advertisement
Ads by CJ

ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసాయి. కానీ అక్కడ హింస రాజ్యమేలుతుంది. ఏపీలోని పలు జిల్లాల్లో వైసీపీ వర్గీయలు, టీడీపీ వర్గీయుల మద్యన దాడులు జరుగుతూన్నాయి. అవి కూడా ఒకరిని ఒకరు చంపుకునేంత. మాచర్ల, తాడిపత్రి వంటి చోట్ల 144 సెక్షన్ పెట్టడమే కాదు, కేంద్రం నుంచి ఏపీకి బలగాలు దిగడం చూస్తే ఏపీలో అరాచకం ఏ రేంజ్ లో ఉందో కనిపిస్తుంది, వినిపిస్తుంది. గన్నవరంలో వంశి వర్గీయులు టీడీపీ కార్యకర్తలపై రెచ్చిపోయి దాడి చేసిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. 

ఇక ఆళ్లగడ్డలో నిన్న అర్థరాత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డు నిఖిల్‌పై హత్యాయత్నం.. అది జరిగిన వీడియో చూస్తే ఒంట్లో నుంచి ఒణుకు వచ్చేస్తుంది. నడి రోడ్డు మీద అఖిలప్రియ బాడీగార్డు నిఖిల్‌ పై కారు ఎక్కించిన దుండగులు, ఆ తర్వాత అతన్ని పరిగెత్తించి మరీ చంపడానికి వస్తున్న సీసీ టీవీ ఫుటేజ్ వైరల్ గా మరింది. 

ఇది చూసాక అఖిలప్రియ టీడీపీ పార్టీ, ఆమె బాడీగార్డు నిఖిల్‌ ని చంపడానికి వచ్చింది ఖచ్చితంగా వైసీపీ వారే, నిజంగా వైసీపీ ఏపీలో ఎంతగా పెట్రేగిపోతుందో చూసారా అంటూ ఏపీ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అఖిలప్రియ బాడీగార్డు నిఖిల్‌ పై హత్యాయత్నానికి పాల్పడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.

YCP anarchy in Andhra:

YCP vs TDP

Tags:   YCP
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ