టైటిల్ చూడగానే ఇదేంటని కాస్త ఆలోచనలో పడ్డారు కదా..! ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే కదా.. జూన్ నాలుగో తేదీ ఫలితాలు ఆ తర్వాత ప్రమాణ స్వీకారం ఉంటుంది.. ఈ విషయం ఐతే తెలుసు. ఇక తెలంగాణలో ఎందుకొస్తుంది..? ఆల్రెడీ డిసెంబర్ నెలలోనే కొత్త ప్రభుత్వమే వచ్చిందిగా మళ్ళీ ఏంటనే సందేహాలు వస్తున్నాయ్ కదా అదే ఇప్పుడు ట్విస్ట్.. ఇంతకీ తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది..? తెలంగాణలో నిజంగానే కాంగ్రెస్ కుప్పకూలుతోందా..? ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి..!!
ఏపీలో ఇదీ సంగతి..!
ఏపీలో మే -13న ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. జూన్ నాలుగో తేదీ ఫలితాలు రాబోతున్నాయి. కూటమి కుప్ప కూలుతుందా..? లేకుంటే వైసీపీ రెండోసారి అధికారంలోకి వస్తుందా అనేది తెలియట్లేదు. ఎవరి గెలుపు ధీమాలో వాళ్ళు ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలిచి తీరుతాం కాకపోతే సీట్లు తగ్గొచ్చని వైసీపీ నేతలు చెబుతుంటే.. అబ్బే అంత సీన్ లేదు ఏపీలో వచ్చేది మేమే అని కూటమి చెప్పుకుంటోంది. ఏం జరుగుతుంది అనేది మరో 19 రోజుల్లో తేలిపోనుంది. అప్పటివరకు
తెలంగాణలో ఎందుకు..?
తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు కాస్త నిశితంగా గమనిస్తే కాంగ్రెస్ సర్కార్ కూలి.. రేవంత్ రెడ్డి ఔట్ అవుతారని రాష్ట్రంలో ఏ ఇద్దరు కలిసినా చర్చించుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి కేరళ వెళ్ళడం.. అసలు ఆయన ఎందుకు వెళ్లారో..? చిల్ అవ్వడానికి వెళ్ళారా..? లేకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలా చేస్తున్నారా అనేది తెలియట్లేదు. పైగా ఆయనతో కలసి కొందరు బీఆర్ఎస్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు ఉండటం గమనార్హం. అంతే కాదు పైలట్ రోహిత్ రెడ్డి.. మీడియాతో మాట్లాడుతూ కొత్త ప్రభుత్వమే రాబోతోంది అన్నట్లుగా సంకేతాలు ఇవ్వడం చర్చనీయాంశం అవుతోంది.
అటు పొంగులేటి.. ఇటు భట్టి..!!
అటు పొంగులేటి కేరళకు వెళ్తే.. ఇటు డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టి విక్రమార్క.. మంత్రి శ్రీధర్ బాబు సొంతూరు ధన్వాడలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అసలు ఎందుకు ఈ ప్రత్యేక భేటీ..? ఏం నడుస్తోంది అనేది తెలియని పరిస్థితి. ఐతే కొసరు కాంగ్రెస్ నేతలు అటు వెళ్తుంటే.. ఇటు ఒరిజినల్ నేతలు భేటీ అవుతున్నారని చర్చ మాత్రం గట్టిగానే జరుగుతోంది. ఇప్పుడు ఈ రెండు పరిణామాలు రాజకీయవర్గాల్లో సరికొత్త చర్చకు దారితీస్తోంది. ఇలా హడావుడి జరుగుతున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మీడియా ముందుకు రావడం ఇవన్నీ సర్కారు కూలిపోవడానికి సంకేతాలు అని తెలుస్తోంది. కొద్ది రోజులు ఆగితే అటు ఆంధ్రాలో ఓటు ఎటు..పోటు ఎవరికీ అనేది.. ఇక తెలంగాణలో ఏం జరుగుతుందో అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే మరి.