ఇస్మార్ట్ శంకర్ అనగానే రామ్ ఎనర్జిటిక్ యాక్షన్, ఆయన ఎనర్జిటిక్ డాన్స్ లు, తెలంగాణ యాస్ డైలాగ్స్, పూరి జగన్నాథ్ మేకింగ్ స్టయిల్, హీరోయిన్స్ గ్లామర్ గుర్తుకు వస్తాయి. అటు పూరి జగన్నాథ్, ఇటు రామ్ ఇద్దరిని ఇస్మార్ట్ శంకర్ ఆదుకుంది, నిలబెట్టింది. ఆ తర్వాత ఇద్దరూ సరైన సక్సెస్ లేక ఇబందిపడుతున్న సమయంలో ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా పూరి-రామ్ డబుల్ ఇస్మార్ట్ అంటూ డబుల్ డోస్ తో సినిమాని మొదలు పెట్టేసారు.
ఈరోజు రామ్ పోతినేని బర్త్ డే సందర్భంగా డబుల్ ఇస్మార్ట్ నుంచి టీజర్ ని విడుదల చేసారు మేకర్స్. ఇస్మార్ట్ శంకర్ లో ఎంతయితే ఎనెర్జీతో మాస్ గా రామ్ రెచ్చిపోయాడో.. దానికి డబుల్ కిక్ ఇస్తూ డబుల్ ఇస్మార్ట్ లో యాక్షన్ అండ్ పవర్ ఫుల్ డైలాగ్స్ తో మరోసారి పూనకాలు తెప్పించాడు.
బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ విలన్ గా కనిపించగా.. సంజయ్ దత్ కి ధీటుగా రామ్ యక్షన్ మాస్ గా కనిపించింది. సంజయ్ దత్ పాత్రను కూడా కాస్త వైలెంట్‌గానే చూపించారు. బిగ్ బుల్ పాత్రలో సంజయ్ దత్ కనిపిస్తున్నారు. తుపాకీ మోతలతో టీజర్ మొత్తం దద్దరిల్లింది. రామ్ తెలంగాణ స్లాంగ్ లో ఇస్మార్ట్ శంకర్ స్టైల్ ల్లో డైలాగ్స్ చెప్పి అదరగొట్టాడు. చివర్లో మళ్ళీ శివుడి రిఫరెన్స్ తో టీజర్ ని ముగించారు.
డబుల్ ఇస్మార్ట్ టీజర్‌లో ఆలీ పాత్ర కూడా కాస్త డిఫరెంట్‌గా కనిపిస్తుంది. రామ్ ఫ్రెండ్ పాత్రలో గెటప్ శీను కనిపించాడు. మొత్తానికి టీజర్ అయితే దీపావళి టపాసులా గట్టిగానే పేలింది. డబుల్ ఇస్మార్ట్ కు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. టీజర్ లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది.