ప్రస్తుతం ఆంధ్రలో ఎన్నికలు ముగిసాయి. పోలింగ్ ప్రశాంతంగానే జరిగినా.. పోలింగ్ బూతుల బయట వైసీపీ-టీడీపీ వర్గీయులు చాలా చోట్ల ఘర్షణలకు దిగారు. రాళ్ళేసుకుని కొట్టుకోవడం, కర్రలతో దాడి, అంతేకాకుండా పెట్రో బాంబులతో ఆంధ్ర లో చాలాచోట్ల భయానక వాతావరణం కనిపించింది. తెనాలి వైసీపీ ఎమ్యెల్యే సామాన్యుడిని కొట్టగా.. అతను తిరిగి కొట్టిన దగ్గర నుంచి.. తాడిపత్రి, పులివెందుల, విజయవాడ ఇలా ఎక్కడా చూసినా వైసీపీ మూక రెచ్చిపోయింది. ఈ ఘటనల్లో ఎక్కువగా వైసీపీ బ్యాచ్ చేసిన రాచకం అంతా ఇంతా కాదు.
అది సోషల్ మీడియాలో కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తూనే ఉంది. కానీ బ్లూ మీడియా మాత్రం అప్పుడే కారు కూతలు మొదలు పెట్టింది. తెనాలి వైసీపీ ఎమ్యెల్యే సామాన్యుడుని కొట్టడం అనేది దళితులని దూషించినందుకు అంటూ వివరణ ఇచ్చుకుంది. మరోపక్క వైసీపీ పై టీడీపీ దాడి చేస్తుంది అంటూ రాసుకుంటుంది. అంతేకాదు.. రేపు రాబోయే ప్రభుత్వం కూటమి అని బ్లూ మీడియా ఫిక్స్ అయ్యింది. అందుకే ఆంధ్ర భవిష్యత్తు భయానకం అంటూ మాట్లాడుతుంది.
మరి ఈ హింస ప్రేరేపించింది ఎవరు. అధికారంలోకి రాగానే ప్రతిపక్షం లేకుండా చెయ్యాలని చూసిన సీఎం జగన్ టీడీపీ నేతలని అడ్డదిడ్డాలుగా జైల్లో పెట్టించడం దగ్గరనుంచి ఎన్నోఅరాచకాలు జరిగాయి. ఇప్పుడు ఈ ఎన్నికల్లో జగన్ ని చూసుకుని వైసీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయి టీడీపీ పై దాడులు చేసారు. విజయవాడలో గన్నవరం వైసీపీ ఎమ్యెల్యే అభ్యర్థి వంశి వల్లభనేని అనుచరులతో చేసిన దాడుల వీడియోస్ వైరల్ అయ్యాయి.
మరి ఈ హింసకి కారణం ఎవరో అనేది రాష్ట్రమంతా చూస్తుంది. దీనికి కారణం టీడీపీ అంటూ బ్లేమ్ చేస్తూ బ్లూ మీడియా ఎంత చెబితే ఎవరు నమ్ముతారు. అందుకే టెన్షన్ లో ఆంధ్ర భవిష్యత్తు భయానకం అంటూ రాతలు పెట్టేసింది.