Advertisementt

ఫహద్ ఫాసిల్ ఎపిసోడ్ తో పుష్ప షూట్ ఫినిష్?

Tue 14th May 2024 08:26 PM
fahadh faasil  ఫహద్ ఫాసిల్ ఎపిసోడ్ తో పుష్ప షూట్ ఫినిష్?
Pushpa shoot finished with Fahadh Faasil episode? ఫహద్ ఫాసిల్ ఎపిసోడ్ తో పుష్ప షూట్ ఫినిష్?
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ పాన్ ఇండియా సీక్వెల్ పుష్ప ద రూల్ చిత్రం షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. త్వరలోనే షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసి పోస్ట్ ప్రొడక్షన్ మొదలు పెట్టేందుకు సుకుమార్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే పుష్ప ద రూల్ నుంచి ఫస్ట్ సాంగ్ మాస్ ఆడియన్స్ ని ఊపేస్తుంది. 

పుష్ప పార్ట్ 2 లో కీలకం కానున్న విలన్ పాత్రధారి ఫహద్ ఫాసిల్ గత ఏడాది పుష్ప షూటింగ్ చేశారు. కానీ ఈమద్యలో ఆయన పుష్ప సెట్స్ లో కనిపించలేదు. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం.. ఫాహద్ ఫాసిల్ తన పార్ట్ షూటింగ్ కోసం 2 వారాల పాటు డేట్స్ ను కేటాయించినట్లు తెలుస్తోంది. పుష్పకి సంబంధించి తన పార్ట్ షూటింగ్ ముగిసిన తర్వాత, దర్శకుడు సుకుమార్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. 

ఇక జూన్ లో పుష్ప నుంచి సెకండ్ సింగిల్ వస్తుంది అనే టాక్ ఉంది.. జులై మొత్తం పుష్ప ద రూల్ ప్రమోషన్స్ కోసం సుకుమార్ కేటాయించారట. ఈసారి పక్కా ప్రమోషన్స్ తో ఆగష్టు 15 థియేటర్స్ లో భూకంపం తెప్పించాలని సుక్కు-బన్నీ ప్లాన్ చేస్తున్నారట. 

Pushpa shoot finished with Fahadh Faasil episode?:

Fahadh Faasil concentrates on Pushpa 2

Tags:   FAHADH FAASIL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ