యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే మే 20. ఎన్టీఆర్ బర్త్ డే కి దేవర నుంచి రాబోయే ఫస్ట్ సింగిల్ పై అభిమానులు అంచనాలు పెంచేసుకుంటున్నారు. అనిరుద్ రవిచంద్రన్ దేవర కి ఎలాంటి మ్యూజిక్ ఇవ్వబోతున్నాడో అనే క్యూరియాసిటీతో తమిళ ప్రేక్షకుల నుంచి టాలీవుడ్ ప్రేక్షకుల వరకు వెయిట్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ కి బ్రేకిచ్చి ఓటెయ్యడానికి హైదరాబాద్ వచ్చాడు. నిన్న భార్య ప్రణతి, తల్లితో కలిసి ఎన్టీఆర్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఓటేశాడు, ఇక ఎన్టీఆర్ మళ్లి తిరిగి ముంబైకి వెళ్ళిపోతాడని, అక్కడ వార్ 2 షూటింగ్ లో పాల్గొంటాడని అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ బర్త్ డే వెకేషన్ కోసం వెళుతూ భార్య ప్రణతి తో కలిసి ఎన్టీఆర్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు.
ఎన్టీఆర్ అలాగే ప్రణతి ఇద్దరూ బ్లాక్ డ్రెస్ లో కూల్ గా కనిపించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఎన్టీఆర్ దేవర నుంచే కాకుండా వార్ 2 నుంచి, అలాగే ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ మొదలు పెట్టబోయే NTR 31 అప్ డేట్ ని కూడా అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.