ఈసారి ఏపీ ఓటర్లు ఎంత తెలివిని ప్రదర్శించారో అనేది చూస్తే చాలామంది ఆశ్చర్యపోతారు. రాజకీయ పార్టీలు ప్రచారం చేసినా.. ఎక్కడో ఒక అపనమ్మకమైతే వాళ్లకి ఉంటుంది. అందుకే ఎన్నికల తేదికి ముందు రెండు రోజులు ముందు వీలైనంతగా తమతమ నియోజకవర్గాల్లో డబ్బుల పంపిణి, మద్యాన్ని ఏరులై పారించడం అనేవి చేస్తూ ఉంటారు.
అయితే గత ఎన్నికల వరకు చాలామంది గ్రామస్తులు, సిటీ ప్రజలు కూడా ఒక పార్టీ దగ్గర డబ్బు తీసుకుని మరొక పార్టీకి ఓటెయ్యడం లాంటివి చెయ్యలేదు. అంటే ఏదో ఒక పార్టీ దగ్గర మాత్రమే డబ్బు తీసుకుని న్యాయం చేసేవారు. పార్టీలు కూడా మన అనుకున్న వారికే డబ్బు పంపిణి చేసేవారు,.
కానీ ఈ ఎన్నికలో వైసీపీ, టీడీపీ, జనసేన వీరంతా ఎవరికి వారే ప్రజలకి డబ్బు పంచడంలో ముందున్నారు మద్యం మాట పక్కనబెడితే.. డబ్బు పంపిణీలో రెండు పార్టీల వారు దూసుకుపోయారు. టీడీపీ ఓటుకి వెయ్యి కొడితే, వైసీపీ ఓటుకి 1150 పంచింది. చాలాచోట్ల వైసీపీ వారు 2 నుంచి మూడు వేల వరకు పంచారు.
ఒక ఇంట్లో నాలుగు ఓట్లుంటే నలుగురికి వెయ్యి చొప్పున నాలుగు వేలు ఇస్తే.. వైసీపీ వాళ్ళు కూడా నాలుగు ఓట్లకు నాలుగు వేలు ఇచ్చారు. అయితే ఈసారి ప్రజలు చాలా తెలివిగా రెండు పార్టీల నుంచి డబ్బు తీసుకుని తమకి నచ్చిన వారికి ఓటేశారు. రెండు పార్టీలు ఇస్తున్న డబ్బు ని వద్దనడమెందుకు, ఇద్దరి దగ్గర డబ్బు తీసుకుని ఎవరికి ఓటేశారో తెలికుండా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మరి ఏపీ ఓటర్లు ఎంత తెలివిగా మారిపోయారంటూ నెటిజెన్స్ కూడా మాట్లాడుకుంటున్నారు.