పవన్ కళ్యాణ్ మొదటి రెండు పెళ్లిళ్లు విడాకులకు దారి తీయగా.. మూడో భార్య అన్న లెజెనోవాతో కూడా విడిపోయారంటూ వైసీపీ నేతలు, ముఖ్యంగా జనసేన నుంచి బయటికి వచ్చేసిన పోతిన మహేష్ పదే పదే మాట్లాడడంతో చాలామంది నిజంగానే పవన్ కళ్యాణ్ అన్న లెజెనోవా తో విడిపోయారనుకున్నారు. చాలారోజులుగా పవన్ తో ఆమె కనిపించడం లేదు.
తాజాగా పవన్ కళ్యాణ్ నిన్న సోమవారం పోలింగ్ రోజున తన భార్య అన్న లెజెనోవాతో కలిసి మంగళగిరిలో అడుగుపెట్టారు. దానితో వైసీపీ నేతల్లో ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి ఫ్యూజులు అవుట్. నిన్నటివరకు పవన్ పెళ్లిళ్లు, మూడో భార్య విషయంలో తెగ మాట్లాడిన వారంతా సైలెంట్ అయ్యారు. నిన్న మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత అక్కడి నుంచి వారణాసి బయలుదేరి వెళ్లారు.
అది కూడా పవన్ కళ్యాణ్ తన భార్య అన్నాలెజెనోవా తో కలిసి నరేంద్ర మోడీ నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతున్నారు. మరి ఎన్నికల విషయంలో భార్యని ఇబ్బంది పెట్టకుండా ఇలా పవన్ కళ్యాన్ తన రాజకీయ ప్రత్యర్థుల కోసం ఆమెని ప్రజల్లోకి తీసుకురాకుండా హుందాగా నడుచుకుంటూ ఈరోజు అన్ని ప్రశ్నలకి తన భార్య రాకతో జవాబు చెప్పారంటున్నారు పవన్ కళ్యాణ్ ఫాన్స్.