కోలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో జీవి ప్రకాష్ తన భార్య సైంధవితో విడిపోతున్నట్లుగా కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ జీవి ప్రకాష్ తన భార్య సైంధవి తో విడిపోతున్నట్లుగా ప్రకటించి అందరికి షాకిచ్చాడు. చాలామంది సెలెబ్రిటీ కపుల్స్ పెళ్లి చేసుకున్న 20 ఏళ్ళు కాపురం చేసాక విడిపోవడం చూస్తున్నాము.
జీవి ప్రకాష్ - సైంధవి లు ప్రేమించుకుని పెళ్లి చేసుకుని పదేళ్ళయ్యింది. పదకొండు ఏళ్ళు ముగుస్తున్న సమయంలో విడిపోతున్నట్లుగా జీవి, సైంధవిలు విడివిడిగా చెప్పడం పలు అనుమానాలకు తావిచ్చింది. తామిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయినట్లుగా ఈ జంట ప్రకటించింది. మరి చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి తిరిగి తర్వాత ప్రేమలో పడి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్న ఈ జంటకి బిడ్డ కూడా ఉంది.
తన భర్తతో చిరకాలం జీవించాలనే కోరికని గత ఏడాదే బయట పెట్టిన సైంధవి ఇప్పుడు ఇలా విడిపోతున్నట్టుగా చెప్పి షాకివ్వడం వారి వారి అభిమానులకి అర్ధం కావడం లేదు. ఏది ఏమైనా పదకొండేళ్ల వివాహ బంధానికి జీవి ప్రకాష్-సైంధవిలు విడాకులతో ముగింపు పలికారు.