మహేష్ బాబు కొడుకు గౌతమ్ ప్రస్తుతం స్టడీస్ మీద ఫోకస్ పెట్టాడు. సితార తల్లితో కలిసి ఎప్పుడూ సందడి చేస్తూ కనిపిస్తుంది. గౌతమ్ మాత్రం ఈమధ్యన చాలా అరుదుగా కనిపిస్తున్నాడు. మహేష్ ఫ్యామిలీ స్విజర్లాండ్ ట్రిప్ తర్వాత నమ్రత, మహేష్, సితారలు కలిసి ఫ్యామిలీ వెడ్డింగ్ లో కనిపించినా అక్కడ గౌతమ్ కనిపించలేదు.
తాజాగా చెల్లి సితార, అమ్మ నమ్రత తో కలిసి ఉన్న పిక్ ని పోస్ట్ చేసాడు. Love you Amma ♥️♥️♥️ Happy Mother/’s Day 😘😘😘😘 @namratashirodkar అంటూ మదర్స్ డే సందర్భంగా గౌతమ్ తన తల్లితో కలిసి సరదాగా ఉన్న పిక్ ని పోస్ట్ చేస్తూ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు.
మహేష్ అయితే ఆయన తల్లి ఇందిరా దేవి, భార్య నమ్రత ఉన్న పిక్ ని పోస్ట్ చేస్తూ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. గౌతమ్ ఇలా చెల్లి, తల్లి తో కలిసి ఉన్న పిక్ తో విష్ చేసాడు.