నిన్న సోమవారంతో ఏపీలో ఎన్నికలు ముగియడంతో పవన్ కళ్యాణ్ రిలాక్స్ అవుతారేమో అనుకుంటున్నారు. గత రెండు నెలలుగా కూటమితో కలిసి ప్రచారంలో పాల్గొనడమే కాదు, తాను నిలబెట్టిన అభ్యర్థుల గెలుపు కోసం ఎండలో కష్టపడిన జనసేనాని.. ఎన్నికలు పూర్తవడంతో ఇకపై రెస్ట్ తీసుకుంటారు అనుకున్నారు.
కానీ పవన్ కళ్యాణ్ నేడు నరేంద్ర మోడీ నామినేషన్ కోసం వారణాసి బయలు దేరి వెళ్లారు. వారణాసిలో మోడీ నామినేషన్ కి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇలా కూటమి అభ్యర్థులు హాజరవుతున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ తన భార్య అన్న లెజెనోవాతో కలిసి వచ్చి మంగళగిరిలో ఓటు వేసి వైసీపీ కి పెద్ద షాకిచ్చారు.
ఇక పవన్ కళ్యాణ్ వారణాసి వెళ్ళొచ్చాక ఎన్నికల రిజల్ట్ వరకు కామ్ గా ఉంటారా.. లేదంటే సినిమాల సెట్స్ మీదకి వస్తారా అనే అనుమానం అభిమానుల్లో ఉంది. కాని పవన్ కళ్యాణ్ జూన్ 4 వరకు సినిమాలకి బ్రేకివ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. రిజల్ట్ వచ్చాక దానికి అనుగుణంగా ఆయన సినిమా షూటింగ్స్ ని పరిగెత్తిస్తారట.
అందుకే సెప్టెంబర్ 27 నుంచి ఆయన సుజిత్ దర్శకత్వంలో నటిస్తున్న OG పోస్ట్ పోన్ అవ్వొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అటు హరీష్ కూడా ఉస్తాద్ పక్కన పెట్టి మిస్టర్ బచ్చన్ షూటింగ్ లో బిజీగా వున్నాడు.