రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పుణ్యమా అని సినిమా ఇండస్ట్రీ మొత్తం సైలెంట్ అయ్యింది. చిన్న చిన్న నిర్మాతలు తప్ప పెద్ద , మీడియం సినిమాలేవీ విడుదల కాలేదు. దానితో ప్రేక్షకులు బాగా బోర్ ఫీలయ్యారు. బాక్సాఫీసు కూడా వారం వారం డల్ అన్నట్టుగానే కనిపించింది. సంక్రాంతి తర్వాత మళ్ళీ ఆ రేంజ్ సినిమాలేవీ బాక్సాఫీసుని తాకలేదు.
ఈమద్యలో మలయాళ సినిమాల హడావిడి ఎక్కువైంది. మలయాళ డబ్బింగ్ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీసు దగ్గర సందడి చేసాయి. మరి నిన్నటితో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి ముగిసింది. గత రెండు నెలలుగా రాజకీయ నేతలు, కార్యకర్తలు, ప్రజలంతా ఎలక్షన్స్ మూడ్ లోనే ఉన్నారు.
నిన్న పోలింగ్ డే పూర్తవడంతో ఇక ప్రజలు, రాజకీయనాయకులు అంతా రిలాక్స్ అయ్యారు. ఇప్పటికైనా బాక్సాఫీసు లో ఉత్సాహం మొదలవుతుందో.. లేదో అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ నెలలో కాజల్ అగర్వాల్ సత్యభామ, విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలు రాబోతున్నాయి. ఇక జూన్ 27 న ప్రభాస్ కల్కి మూవీ, ఆ వెంటనే ఇండియన్ 2, ఆ తర్వాత ఆగష్టు లో పుష్ప ద రూల్ రాబోతున్నాయి.
దసరా కి అయితే చాలా సినిమాలు క్యూ లో ఉన్నాయి. అందులో దేవర మస్ట్ ఫిక్స్. మిగతా సినిమాలు ఎన్ని బాక్సాఫీసు బరిలో ఉంటాయో చూడాలి.