ఏపీలో ఈరోజు జరిగిన ఎన్నికలు కొన్ని చోట్ల ప్రశాంతంగా, మరికొన్ని చోట్ల ఘర్షణల నడుమ ముగిసింది. ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి కొద్దిచోట్ల పోలింగ్ పూర్తి కాగా.. మరికొన్ని చోట్ల క్యూలో కొంతమంది నిలబడి ఉన్నవారిని సమయం దాటిపోయినా.. ఓటింగ్ కి అనుమతినిచ్చారు. అయితే పలు చోట్ల వైసీపీ వర్గీయులు, టీడీపీ వర్గీయుల మద్యన వాదనలు కాదు తోపులాటలు, రాళ్ళు విసురుకోవడం లాంటి చెదురు మదురు సంఘటనలు జరిగాయి.
ఇక ఈ రోజు పోలింగ్ వేవ్ మాములుగా లేదు. ఏపీలో ఎన్నడూ లేని విధంగా మహిళలు, ముసలి వాళ్ళు, యూత్ కూడా ఓటెయ్యడానికి ఉత్సాహం చూపించారు. చాలామేరకు ఈసారి బాబు గారి గెలుపు ఖాయమనే మాట వినిపిస్తోంది. మహిళలు, ఇంకా వృద్దులు చంద్రబాబు పథకాలకు పడిపోయి ఓటు వేసారని అంటున్నారు.
జగన్ పథకాల్లో కొత్తదనంలేదు, కొద్దిగా పెంచి చెప్పడమే కాకుండా ఈ ఐదేళ్ళలో పెన్షన్ కొద్ధి కొద్దిగా పెంచుకుంటూ రావడం, సంక్షేమ పథకాల్నిపట్టించుకుని రోడ్లు వగైరా అభివృద్ధిని జగన్ నిర్లక్ష్యం చేసిన కారణం గానే ఈసారి జాగన్ కి దెబ్బపడుద్ది అని ఓటు వేసేందుకు వచ్చిన పలువురు మాట్లాడుకుంటున్నారు.
చదువుకున్న వారు, రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకునే వారు జగన్ కి ఓటెయ్యలేదనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఇక జగన్ ఓట్ బ్యాంకు కింద ఎమన్నా పేద ప్రజల ఓట్లు పడినా.. టీడీపీ కూటమి 100 నుంచి 110 స్థానాలైతే పక్కాగా కొడుతోంది అంటున్నారు. చూద్దాం జూన్ 4 న ఏపీలో ఎలాంటి రిజల్ట్ రాబోతుందో అనేది.