ఈమధ్యన మహేష్ అభిమానులే కాదు.. పాన్ ఇండియా ప్రేక్షకులు కూడా రాజమౌళి-మహేష్ సినిమాపై వచ్చే అప్ డేట్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం ఎలా మేకోవర్ అవుతున్నారా అనే ఆసక్తి అంతకంతకు ఆయన అభిమానుల్లోపెరిగిపోతుంది. ఈమధ్యన మహేష్ ఫ్యామిలీ వెడ్డింగ్ లో హెయిర్ బాగా పెంచి కనిపించారు.
ఇక ఈరోజు మహేష్ బాబు ఓటెయ్యడానికి భార్య నమ్రతతో కలిసి వస్తారని తెలిసి ఆయన అభిమాను చాలా క్యూరియాసిటీగా ఎదురు చూడడం మొదలు పెట్టారు. మహేష్ తన భార్య నమ్రతతో కలిసి 3 గంటలకు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో ఓటు వేసేందుకు రాగానే ఫోటో గ్రాఫర్స్ తమ కెమెరాలకు పని చెప్పారు. మహేష్ లాంగ్ హెయిర్ లో కనిపించినా దానిని కవర్ చేసేందుకు క్యాప్ పెట్టేసారు. బ్లూ షర్ట్ లో మహేష్ చాలా హ్యాండ్ సమ్ గా ఫిట్ గా కనిపించారు.
జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో మహేష్ అలాగే నమ్రత తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అయితే మహేష్-రాజమౌళి కాంబో మూవీ ఆగష్టు కానీ లేదంటే సెప్టెంబర్ నుంచి కానీ మొదలయ్యే ఛాన్స్ ఉంది. రాజమౌళి కూడా ఓటు వేసేందుకే దుబాయ్ నుంచి వచ్చారు. ప్రస్తుతం ఆయన మహేష్ సినిమా పని మీద బిజీగా వున్నారు.