Advertisementt

పాపం రోజమ్మ.. సొంత వారిపైనే అనుమానం

Mon 13th May 2024 04:45 PM
roja  పాపం రోజమ్మ.. సొంత వారిపైనే అనుమానం
Roja sensational comments on own party leaders పాపం రోజమ్మ.. సొంత వారిపైనే అనుమానం
Advertisement
Ads by CJ

నగరిలో ఈసారి రోజాకి ఓటమి తప్పదని పలు సర్వేల్లో తేలిపోయింది. అసలు ఆమెకి జగనన్న సీటు ఇవ్వడం లేదు అంటూ తెగ ప్రచారం జరిగింది. కానీ నగరి సీటు ఫైనల్ గా రోజాకు వచ్చింది. ఆమె ఎమ్యెల్యేగా ఉన్నప్పటి కన్నా మంత్రి అయ్యాక ఎక్కువ డ్యామేజ్ జరిగింది. నగరి ప్రజల్లో రోజాపై సొంత పార్టీ వాళ్ళే చేడుగా ప్రచారం చేసారు. 

రోజా ని గెలవకుండా ఆమె సొంత పార్టీ వాళ్ళే అడ్డం పడుతున్నట్టుగా పోలింగ్ డే రోజున రోజానే ఒప్పుకోవడం షాకిచ్చింది. ఆమె మొహంలో ఓటమి ఛాయలు స్పష్టంగా కనిపించడం మరింత ఆశ్చర్యకర విషయం. అక్కడ జగన్ గెలుస్తాడు, నగరిలో రోజా గెలుస్తుంది. జగన్ అనే నేను అని జగనన్న అంటాడు, ఇక్కడ అసంబ్లీలో రోజా అనే నేను అని నేను అంటాను ఇది పక్కా అన్నప్పటికీ.. 

రోజా తన నగరి నియోజక వర్గంలో తనకి టీడీపీ వాళ్ళతో ఇబ్బంది లేదు... సొంత పార్టీ వాళ్ళే టీడీపీ కి ఓటు వెయ్యమని చెబుతున్నారు, జగన్ గారు వస్తే ఎయిర్ పోర్ట్ కి వెళ్లి కలిసి ఆయన్ని దీవించమంటారు. ఇక్కడ మాత్రం టీడీపీ కి ఓటెయ్యమని, ప్రతి ఇంటికి వెళ్లి సైకిల్ కి ఓటెయ్యమని చెప్పారు.. అంటూ రోజ సొంత పార్టీ నేతలపైనే సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. 

Roja sensational comments on own party leaders:

Roja sensational comments on Nagari YCP leaders

Tags:   ROJA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ