నిన్నటివరకు సీఎం స్థానంలో ఉన్న జగన్ దగ్గర నుంచి వైసీపీ నేతలు, బ్లూ మీడియా రెండూ పవన్ కళ్యాణ్ భార్యలపై, పవన్ కళ్యాణ్ మూడో భార్యపై, ఆయన పెళ్లిళ్లు, విడాకులపై నీచమైన కామెంట్స్ చేసారు. పవన్ కళ్యాణ్ అంటే అభిమానమంటూ జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరించి.. చివరికి తనకి సీటు దక్కలేదన్న కోపంతో వైసీపీ లోకి వెళ్ళిపోయిన పోతిన మహేష్ కూడా పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్న లెజెనోవా పై చెయ్యని కామెంట్స్ లేవు.
పవన్ కళ్యాణ్ నీకు దమ్ముంటే నీ మూడో భార్యని తీసుకుని పిఠాపురం వెళ్లి అక్కడి ఇంటి గృహ ప్రవేశం చెయ్యి, లోకేష్ కి బ్రాహ్మణి ఉంది, చంద్రబాబుకి భువనేశ్వరి ఉంది, జగన్ కి భారతమ్మ ఉంది.. మరి నీకెవరు ఉన్నారంటూ అవమానకరంగా మాట్లాడాడు. ఇక జగన్ అయితే పవన్ పై ఎలాంటి కామెంట్స్ చెయ్యాలో తెలియక ఆయన పెళ్లిళ్లు, భార్యలపై నీచంగా మాట్లాడిన సందర్భాలు కోకొల్లలు.
మరి వీరందరికి చెంప పెట్టు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ ఈరోజు తన భార్య అన్న లెజెనోవాతో కలిసి మంగళగిరి వెళ్లి ఓటు వేసిన పిక్స్, వీడియోస్ వైరల్ గా మారడంతో వైసీపీ నేతలు, బ్లూ మీడియా కిమ్మనకుండా ఉండిపోయింది. బ్లూ మీడియా అయితే ఫైనల్ గా మూడో భార్యకి విడాకుల రూమర్స్ కి పవన్ ఇలా ఓటు వేయ్యడానికి భార్యని తీసుకొచ్చి చెక్ పెట్టాడు అంటూ మళ్ళి వార్తలు మొదలెట్టేసింది.