2019 ఎలక్షన్స్ కన్నా 2024 ఎన్నికలు మాత్రం ఏదో ఒక మ్యాజిక్న్ క్రియేట్ చేసేట్టుగా కనిపిస్తుంది ప్రస్తుత వ్యవహారం. అక్కడ ఎవరు గెలుస్తారు, జగన్ గెలిచి మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకుంటాడా.. లేదంటే చంద్రబాబు సీఎం గా అవుతాడా అనేది పక్కనబెడితే.. ఏపీలో జరుగుతున్న పోలింగ్ లో పెద్ద సంఖ్యలో ఓటర్లు పాల్గొనడం నిజంగా ఆశ్చర్యకర విషయం.
వేరు వేరు రాష్ట్రాలకి వలస వెళ్లినవాళ్లంతా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఏపీలోని సొంత ఊర్లకి చేరుకొవడమే శుభ పరిణామం అనుకుంటే.. ఈరోజు సోమవారం మే 13 న ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ముసలి, ముతక, యువత, మహిళలు అంతా క్యూ కట్టి ఓట్లు వేసేందుకు నిలబడడం చూస్తుంటే ఏపీలో ఈసారి ఓటింగ్ శాతం బాగా పెరిగింది అనే చెప్పుకోవాలి. ఓటు వెయ్యడం ప్రతి పౌరుడి మొదటి హక్కు అన్నట్టుగానే ఏపీ ప్రజల్లో ఓటు పై అవగాహన పెరిగి చైతన్యం వచ్ఛినట్టే అనిపిస్తుంది.
ఉదయం 11 గంటల సమయానికే 18 శాతం ఓట్లు పోలయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే చాలావరకు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. హైదరాబాద్ లో మెగాస్టార్ చిరు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, నాగ చైతన్య, రాజమౌళి, కళ్యాణ్ రామ్ వంటి సెలబ్రిటీస్ ఓటు హక్కుని వినియోగించుకోగా.. తిరుపతిలో మోహన్ బాబు, మంచు విష్ణు ఓటు వేశారు.