Advertisementt

పవన్ కి మద్దతుపై అల్లు అర్జున్ క్లారిటీ

Mon 13th May 2024 08:57 AM
allu arjun  పవన్ కి మద్దతుపై అల్లు అర్జున్ క్లారిటీ
Allu Arjun clarity on supporting Pawan పవన్ కి మద్దతుపై అల్లు అర్జున్ క్లారిటీ
Advertisement
Ads by CJ

ఈరోజు సోమవారం మే 13 న బీఎస్ఎన్ఎల్‌ సెంటర్‌ జూబ్లీహిల్స్ లో ఓటు హక్కు వినియోగించుకున్న అల్లు అర్జున్ తనపై వస్తున్న విమర్శలపై, నంద్యాల టూర్ పై క్లారిటీ ఇచ్చాడు. ఫ్యామిలీ మెంబెర్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని వదిలేసి నంద్యాల వెళ్లి అక్కడ వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతు ఇవ్వడంపై అల్లు అర్జున్ మెగాభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేఖత ఎదుర్కున్నాడు.

సొంత ఫ్యామిలీ మనిషిని వదిలేసి ఇలా ఫ్రెండ్ కి మద్దతు ఇవ్వడం ఏమిటి అంటూ విమర్శించారు. అయితే ఈరోజు ఓటు హక్కును వినియోగించుకున్న అల్లు అర్జున్ తనపై వస్తున్న విమర్శలకు క్లారిటీ ఇచ్చాడు. నాకు ఏ రాజకీయ పార్టీలతో  సంబంధం లేదు. మా మావయ్య పవన్ కళ్యాణ్ కు నా మద్దతు ఎపుడూ ఉంటుంది. శిల్పా రవి నాకు 15 ఏళ్లుగా మిత్రుడు అతనికి మద్దతు ఇస్తాను అని గతంలో మాట ఇచ్చాను. 

రాజకీయాలతో సంబంధం లేకుండా స్నేహితుడిగా మాత్రమే శిల్పా రవికి మద్దతుగా నంద్యాల వెళ్లాను. నాకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అస్సలు లేదు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించు కోవాలని కోరుకుంటున్నాను అంటూ అల్లు అర్జున్ పవన్ కి మద్దతుపై మరోసారి పక్కా క్లారిటీ ఇచ్చాడు. 

 

Allu Arjun clarity on supporting Pawan:

Allu Arju cast their vote at polling booth in Jubilee Hills

Tags:   ALLU ARJUN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ