అక్కినేని నాగార్జున తర్వాత ఆయన కుమారులు అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్, అలాగే నాగార్జున సిస్టర్స్ కొడుకులైన సుమంత్, సుశాంత్, మేనకోడలు సుష్మితలు అక్కినేని వారసులుగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అందులో చైతు కెరీర్ కాస్త బావుంటే. అఖిల్ హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇక సుమంత్, సుశాంత్ లు కూడా కెరీర్ లో సతమతమవుతున్నారు. ఇక నాగ్ మేనకోడలు నటిగానే కాదు నిర్మాతగానూ, అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలతో బిజీగా ఉంటుంది. తాజాగా అక్కినేని యంగ్ బ్యాచ్ అంతా సింగిల్ ఫ్రేమ్ లో కనిపించారు. అక్కినేని యువ హీరోలంతా ఒకే ఫ్రేమ్ లో ప్రత్యక్షమవ్వడం రేర్ అనే చెప్పాలి. ఇది హ్యాపీ మూవ్ మెంట్.
ఇక నాగ చైతన్య తండేల్ చిత్రం షూటింగ్ తో బిజిగా ఉండగా.. అఖిల్ తదుపరి చిత్రాన్ని అనౌన్స్ చెయ్యడానికి ఆలోచనలో ఉన్నాడు.