కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. నయనతార సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకి తల్లయింది. నయనతార సరోగసి విషయంలో పెద్ద రాద్దాంతమే నడిచింది. ఒక పక్క కెరీర్ మరో పక్క పిల్లల పోషణతో నయనతార సమయం ఇట్టె గడిచిపోతుంది.
తన ఇద్దరు పిల్లలు ఉయిర్, ఉలగం లతో నయనతార ఎప్పటికప్పుడు అల్లరి చేస్తున్న వీడియోస్ ని కొత్తగా ఇన్స్టా లో అడుగుపెట్టి మరీ అభిమానులతో పంచుకుంటుంది. విగ్నేష్ శివన్ కూడా తరచూ పిల్లల అల్లరిని అభిమానుల కోసం షేర్ చేస్తాడు. ఈరోజు మదర్స్ డే సందర్భంగా నయనతార తన కొడుకులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న అపురూప క్షణాలని ఓ వీడియో రూపంలో షేర్ చేసింది.
ఉయిర్, ఉలగం లతో నయనతార కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు అల్లరి చెయ్యడం, ఫ్లైట్ లో వెళుతున్నప్పుడు డాన్స్ చెయ్యడం, కొడుకులతో ముద్దులు పెట్టించుకోవడం, బయట సరదాగా కొడుకులతో కలిసి నయనతార ఆడుకుంటూ ఉన్న క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.