Advertisementt

అల్లు అర్జున్ పై తీవ్ర విమర్శలు

Sun 12th May 2024 10:55 AM
allu arjun  అల్లు అర్జున్ పై తీవ్ర విమర్శలు
Severe criticism on Allu Arjun అల్లు అర్జున్ పై తీవ్ర విమర్శలు
Advertisement
Ads by CJ

 

అల్లు అర్జున్ మెగా హీరో, ఫ్యామిలీ సభ్యుడైన పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చెయ్యకుండా ఫ్రెండ్ కోసం ప్రచారం చెయ్యడంపైన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. వెళ్తాను బ్రదర్.. నా మనసుకు నచ్చితే ఎవ్వరికైనా ప్రచారం చేస్తా అంటూ మాట్లాడిన అల్లు అర్జున్ ని క్లోజ్ ఫ్రెండ్, క్లాస్ మేట్ కోసం ప్రచారానికి వెళితే ఎవ్వరూ ఏమనే వారు కాదు. 

కానీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి అల్లు అర్జున్ క్లాస్ మేట్ కాదు, అతను ఫ్రెండ్ కాదు. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి భార్యక్లాస్ మేట్, ఫ్రెండ్. అలా అల్లు అర్జున్-శిల్పా రవిచంద్ర రెడ్డి ఫ్రెండ్స్ అయ్యారు. దాని కోసమే శిల్పా రవిచంద్ర రెడ్డి ని సపోర్ట్ చేస్తూ నంద్యాల వెళ్లడంపైనే అల్లు అర్జున్ ని విమర్శించేది. సొంత కుటుంబ సభ్యుడిని వదిలేసి.. భార్య ఫ్రెండ్ భర్త కోసం ఇలా అల్లు అర్జున్ వెళ్లడమే చాలామందికి నచ్చలేదు. 

శిల్పా రవిచంద్ర రెడ్డి కూడా అల్లు అర్జున్ తనకి ఫ్రెండ్ కాదు, తన భార్య ఫ్రెండ్ కి భర్త.. అయితే అలా కలిసాక ఎక్కువ పార్టీలకి, టూర్ లకి కలిసి వెళ్ళాము, హైదెరాబాలో కాదు కానీ.. ఇండోనేషియా, కశ్మీర్ ఇలా అల్లు అర్జున్ ఫ్యామిలీ తో కలిసి వెళ్ళేవాళ్ళం, అల్లు అర్జున్ తో కలిసినప్పుడు రాజకీయాలపై డిస్కర్స్ చేస్తాము, అతనికి రాజకీయాలంటే బాగా ఇంట్రెస్ట్.. నా కోసం అల్లు అర్జున్ ప్రచారానికి వస్తాడని నేను ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. ట్వీట్ వేసాడు అదే ఎక్కువ అనుకుంటే.. తాను నా ఇంటికి వచ్చి నా కోసం ప్రచారం చేసాడు అంటూ శిల్పా రవిచంద్ర రెడ్డి  తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.   

Severe criticism on Allu Arjun:

Allu Arjun visit to Nandyal YSRCP candidate house leave everyone surprise

Tags:   ALLU ARJUN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ